జీఎస్టీ అంటే ‘గాడ్ - సెక్స్ అండ్ ట్రూత్’ అంటూ కొత్త నిర్వచనం చెప్తూ వర్మ తెరకెక్కించిన మూవీ ఇప్పుడు సమాజంలో ఎంతగా చర్చకు తెరతీసిందో చూస్తున్నాం. ఈ చర్చల్లో వర్మ తనదైన శైలిలో షాకింగ్ కామెంట్స్ చేస్తూ డిబేట్ లో పాల్గొంటున్న వారిని డిఫెన్స్ లో పడేస్తూ.. నేను చట్టవ్యతిరేకంగా ఏ పనీ చేయట్లేదని, స్వేచ్చగా జీవిస్తున్నానంటున్నాడు వర్మ.

 

పోర్న్ స్టార్ మియా మాల్కోవా `జీఎస్టీ`లో నాకు సెక్స్ అంటే ఇష్టం. నా ఇష్టమొచ్చినట్లు అనుభవిస్తాను.  నేను కేవలం ఒక్కరికే సొంతం అవను. అని భావించే ఒక స్త్రీ గా నటించిందన్నారు. తరతరాలుగా పురుషుడు కూడా ఈ తరహాలోనే తనకు నచ్చిన వారితో సెక్స్ చేస్తా అనే ఫీలింగ్ తో ఉన్నాడని వర్మ చెప్పారు. అది విష సంస్కృతి కాదని... అమృత సంస్కృతి అని చెప్పారు. ఒక అమ్మాయి ఆ విధంగా ఆలోచిస్తోందని...అలా చేయవద్దని చెప్పే హక్కు ఎవరికీ లేదని... అయితే తాను అందరు అమ్మాయిలూ అలా చేయమని చెప్పడం లేదని అన్నారు. చానెల్ ప్రతినిధి అడిగిన ఓ ప్రశ్నకు వర్మ దిమ్మదిరిగిపోయే సమాధానమిచ్చాడు. జీఎస్టీ ప్రభావం పిల్లలపై పడుతుందన్న ప్రశ్నకు.. టీనేజ్ పిల్లలు పోర్న్ చూస్తే తప్పేంటి, అది సహజ ప్రక్రియ అని వర్మ ఎదురు ప్రశ్నించి షాక్ ఇచ్చాడు.

 

కామసూత్ర జస్ట్ ఎల్ కేజీ లాంటిదని... తనతో పాటు చాలామంది ఆ విషయంలో పీ.హెచ్.డీ చేశారన్నారు. ప్రేమకు సెక్స్ కు సంబంధం లేదని సెక్స్ అనేది ఒక కోరికని అది ఒక శారీరక భావోద్వేగమని చెప్పారు. ఆ భావోద్వేగాన్ని నియంత్రించుకొని కేవలం భార్యా భర్తలు మాత్రమే ఒకరితో ఒకరు సెక్స్ లో పాల్గొనాలని సమాజంలో కొన్ని వర్గాలు కట్టుబాట్లు విధించుకున్నాయన్నారు. సమాజాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఆ కట్టుబాట్లుంటాయన్నారు.

 

ఇక పిల్లలు పోర్న్ చూసి చెడిపోతే ఏలా అన్న ప్రశ్నకు అసలు పిల్లలు పోర్న్ చూస్తే తప్పేంటని వర్మ ప్రశ్నిస్తున్నారు. వారికి కౌమార దశ వచ్చే వరకు పోర్న్ చూసినా.. చూడకపోయినా వారు చెడిపోరని.. కౌమార దశకు వచ్చాక కొద్దిగా డిస్టర్బ్ అవుతారని షాకింగ్ కామెంట్స్ చేశారు. తన అనుభవంలో సెక్స్ గురించి తెలిసిన విషయాలన్నింటినీ మియా చేత చెప్పించానన్నారు. సెక్స్ చేయడం వల్ల మనిషికి తృప్తి లభించి హాయి కలుగుతుందని, ప్రేమ వల్ల ఒకరి నుంచి ఒకరు ఆశించడం పెరుగుతుందని, ఆ అంచనాలు అందుకోలేక మనస్పర్థలు వచ్చే అవకాశముందని వర్మ తనదైన శైలిలో అర్థం చెప్పారు.

 

సెక్స్ అనేది ప్రకృతి ద్వారా మానవుడికి సహజ సిద్ధంగా లభించిన వరమని.. దానిని మొదటిసారి బోల్డ్ గా ప్రపంచానికి చాటి చెప్పిన తొలి మహిళ మార్లిన్ మన్రో అని వర్మ చెప్పారు. అయితే వర్మ ఓ ఇంటర్వ్యూలో తాను ఎంత మందిని సెక్స్ కోసం అడిగానో లెక్క లేదని,, చాలా మందితో చేశానని చెప్పడం వివాదాస్పదమైంది. అయితే ఇలా విచ్చల విడిగా దేశ చట్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించి తాను బహిరంగంగా మీడియాలో తాను అలా వ్యవహరించినట్లు యధేచ్చదా చెప్పడాన్ని స్వేచ్ఛగా చెప్పుకుంటూ విశృంఖలత్వాన్ని పోషిస్తున్నారని ఇలాంటి వారిని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.