రీసెంట్ గా మెగాస్టార్‍ చిరంజీవి చిత్రం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది త్రిష. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఆచార్య తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా త్రిషని ఎంపిక చేసుకున్నారు. త్వరలోనే ఆమె షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. ఇంతలోనే ఆమె సినిమా నుంచి తప్పుకున్నట్టు ట్విటర్‍ ద్వారా వెల్లడించారు. కొన్నిసార్లు తొలుత మనతో చర్చించిన విషయాలు ఒకటైతే.. తర్వాత అక్కడ కనిపించేవి మరోలా ఉంటాయి. ఇలాంటి విభేదాల కారణంగానే చిరంజీవి సర్‍ చిత్రం నుంచి తప్పుకుంటున్నా. మరో ఆసక్తికరమైన సినిమాతో త్వరలోనే నా ప్రియమైన తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తా అని ట్వీట్‍ చేసింది త్రిష. దాంతో అందరూ త్రిషకు,టీమ్ కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని భావించారు. అయితే అసలు కారణం వేరే ఉందని సమాచారం.  అదేమిటంటే..

త్రిషను ఈ సినిమా సైన్ చేయించేటప్పుడు ఓ రెమ్యునేషన్ అనుకున్నారు. అయితే ఎప్పుడైతే ఈ సినిమాలో మరో స్టార్ హీరో చేస్తున్నారో అఫ్పుడు చిరు పాత్ర,ఆయన జోడి అయిన త్రిష పాత్ర తగ్గిపోయింది. దాంతో త్రిష డేట్స్ కూడా తక్కువ అవసరం అవుతాయి. ఇది గమనించిన టీమ్...రెమ్యునేషన్ తగ్గించుకోమని చెప్పారట. అలాగే తమ సినిమాలో నటించే మరో స్టార్ హీరోకు జోడీగా ఓ యంగ్ హీరోయిన్ ని తీసుకోవాల్సి వస్తుందని, ఆమెకు కూడా పే చెయ్యాలి కాబట్టి తగ్గించి తీసుకోమని చెప్పారు. అయితే త్రిష ఇవన్నీ తనకు తెలియవని, తనతో మొదట కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రెమ్యునేషన్ ఇస్తే చేస్తానని, లేదంటే బై అని నిర్మహమాటంగా చెప్పిందట. దాంతో ఆ టీమ్ సరే అని, కాజల్ తో టచ్ లోకి వెళ్లారు. త్రిష ఇలా ట్విట్టర్ లోకి టచ్ లోకి వచ్చింది. 

గతంలో చిరంజీవి, త్రిష కలిసి స్టాలిన్ సినిమాలో నటించారు.. మళ్ళీ చాలా కాలం తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కానీ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా త్రిష వెల్లడించి అందరికి షాక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు త్రిష స్థానంలో హీరోయిన్‌గా కాజల్‌ని తీసుకోవాలని అనుకుంటుందట చిత్రబృందం..ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిగాయని తెలుస్తోంది. త్వరలోనే కాజల్ కూడా ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొననుందని తెలుస్తోంది. గతంలో చిరు, కాజల్ కాంబినేషన్ లో 'ఖైదీ 150' అనే సినిమా తెరకెక్కింది.