Asianet News TeluguAsianet News Telugu

Keeravani:కీరవాణి బూతు ట్వీట్ రచ్చ, ఈ టర్న్ తీసుకుందేంటి?

అనుకోకుండా ఎంఎం కీరవాణి సీన్ లోకి వచ్చారు.  ప్రతి ఒక్కరి స్వేచ్ఛను గౌరవిస్తానంటూనే, ఇంగ్లీష్‌లో అక్షరాలు టైప్ చేయడం తనకు సరిగా రాదని... అప్పర్ కేస్, లోయర్ కేస్ టైపింగ్‌లో బ్యాడ్ అంటూ రసూల్ పూకుట్టి పేరులో కొన్ని అక్షరాలను అప్పర్ కేస్‌లో టైప్ చేశారు. 

Why Keeravani delete a tweet tagging Resul?
Author
Hyderabad, First Published Jul 6, 2022, 10:05 AM IST

స్టార్స్ సోషల్ మీడియాలో స్పందించేటప్పుడు ఆచి,తూచి అడుగు వేయాలి. లేకపోతే వారి పరువు తీసేందుకు చాలా మంది రెడీగా ఉంటారు. ఇప్పుడు 
ట్విట్టర్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి విషయమై  హాట్ హాట్ డిస్కషన్‌కు జరుగుతోంది. కీరవాణి కంగారుపడి, ఆవేశంలో తప్పు చేశారని కొందరు, ఒక్క ట్వీట్‌తో స్థాయిని తగ్గించుకున్నారని మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. ఆ ఎమోషన్ కరెక్ట్ అంటూ  ఇంకొంతమంది కీరవాణికి మద్దతు తెలియజేస్తున్నారు.  వివరాల్లోకి వెళితే...

 ఆస్కార్ పురస్కార గ్రహీత, ప్రముఖ సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి ఆర్.ఆర్.ఆర్ ని  'గే లవ్ స్టోరీ' అన్నారు. దాంతో 'బాహుబలి' నిర్మాతలలో ఒకరైన శోభు యార్లగడ్డ ఘాటుగా స్పందించారు.  'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కాదని, ఒకవేళ అయితే తప్పేంటి? అని రసూల్ పూకుట్టిని ఆయన ప్రశ్నించారు. దానికి పూకుట్టి రిప్లై ఇస్తూ..''ఒకవేళ 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ అయినా తప్పేం లేదు. నేను నా స్నేహితుడికి రిప్లై ఇచ్చాను... అదీ పబ్లిక్ డొమైన్ లో ఉన్న చర్చ గురించి చెప్పాను తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఇందులో దిగజారడం ఏమీ లేదు. నువ్వు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు శోభు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదు. ఇంతటితో నేను ముగిస్తున్నాను'' అన్నారు.

ఈ నేపధ్యంలో రసూల్ పూకుట్టి  ట్వీట్ చాలా  నెటిజన్లుకు కోపం తెప్పించింది. కావాలనే  తెలుగు సినిమాను తక్కువ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ లోగా అనుకోకుండా ఎంఎం కీరవాణి సీన్ లోకి వచ్చారు.  ప్రతి ఒక్కరి స్వేచ్ఛను గౌరవిస్తానంటూనే, ఇంగ్లీష్‌లో అక్షరాలు టైప్ చేయడం తనకు సరిగా రాదని... అప్పర్ కేస్, లోయర్ కేస్ టైపింగ్‌లో బ్యాడ్ అంటూ రసూల్ పూకుట్టి పేరులో కొన్ని అక్షరాలను అప్పర్ కేస్‌లో టైప్ చేశారు. అందులో బూతు అర్థం వచ్చేలా ఉండటం గమనార్హం. కీరవాణి ట్వీట్‌లో బూతు నెటిజన్లకు సులభంగా అర్థమైంది. ఆయన తీరు సరి కాదని కొందరు ట్వీట్లు చేశారు. ట్వీట్ చేసిన కాసేపటికి కీరవాణి డిలీట్ చేసినా... ఆయన మీద వ్యతిరేకత ఆగలేదు.

దాంతో గ్యాప్ తీసుకుని ఆయన మరికొన్ని ట్వీట్లు చేశారు. టైపింగ్ డిఫెక్ట్ పోయిందని, కొత్తగా క్యారెక్టర్ బ్లైండ్‌నెస్‌ వచ్చిందని పేర్కొన్నారు. తనకు రామ్, భీమ్ క్యారెక్టర్లు కనిపించడం లేదని.. దేశభక్తుడు అయినటువంటి అజయ్ దేవగణ్ పాత్ర ఒక్కటే కనిపిస్తోందటూ ట్వీట్లు చేశారు. గే లవ్ స్టోరీ కామెంట్లపై వ్యంగ్యంగా స్పందించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios