రైడ్ లో దొరికిన నటి ఎవరో తెలిస్తే షాకే..తిట్టిపోస్తారు!

 రైడ్ లో ఒక టాలీవుడ్ నటి పట్టుబడింది అనే వార్త హల్ చల్ చేసింది. నిన్న కలకలం రేపింది. ఆమెకి, ఒక  డ్రగ్స్  సిండికేట్ కి సంబంధం ఉందని ఆదివారం నుంచి టీవీల్లో, సోషల్ మీడియాల్లో, వెబ్ సైట్ లలో వార్తలు మొదలయ్యాయి. ఆమె నోరు విప్పితే టాలీవుడ్ పరువు ఏమౌతుందనే భయం ఉందంటూ మరికొందరు చెప్పుకొచ్చారు. 

who is that actress attend to ncb interrogation jsp

నిన్నంతా మీడియాలో  ఒకటే హంగామా. ముంబైలో  నారాకోటిక్స్ కంట్రోల్ బ్యూరో  చేసిన రైడ్ లో ఒక టాలీవుడ్ నటి పట్టుబడింది అనే వార్త హల్ చల్ చేసింది. నిన్న కలకలం రేపింది. ఆమెకి, ఒక  డ్రగ్స్  సిండికేట్ కి సంబంధం ఉందని ఆదివారం నుంచి టీవీల్లో, సోషల్ మీడియాల్లో, వెబ్ సైట్ లలో వార్తలు మొదలయ్యాయి. ఆమె నోరు విప్పితే టాలీవుడ్ పరువు ఏమౌతుందనే భయం ఉందంటూ మరికొందరు చెప్పుకొచ్చారు. ఇంతకీ ఎవరు ఆమె అనేది సస్పెన్స్ గా మిగిలింది. అయితే అందరూ అనుకున్నట్లుగా ఆమెకు అంత పాపులర్ నటి కాదు.  

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆ నటి పేరు శ్వేతా కుమారి. అయితే, ఈ విషయాన్ని ఎన్‌సీబీ అధికార్లు ధ్రువీకరించలేదు. అలాగే సదరు శ్వేతా కుమారి అసలు టాలీవుడ్ నటి కాదు.. కన్నడ నటి. తెలుగులో ఈమె పలు చిత్రాల్లో నటించిందని అనేసారు.... కానీ ఆమె ఏ సినిమాలు చేసిందో ఎవరికీ తెలియరాలేదు.

కానీ, కన్నడలో మాత్రం 2015లో వచ్చిన ‘రింగ్ మాస్టర్’లో శ్వేతా కుమారి నటించింది. శ్వేతా కుమారి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) కస్టడీ నుంచి సోమవారం ఉదయం తప్పించుకుందని సాయంత్రం మళ్లీ ప్రత్యక్షమైందని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఎన్‌సీబీ అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు.
  
కాకపోతే  ఫేస్ కి చున్నీ కప్పుకొని… మీడియా ముందుకు వచ్చిన ఈ నటి పేరు ఏంటో తెలిసాక మాత్రం చాలా మంది ఊపిరి పీల్చుకున్నారని అంటున్నారు. అలా ఊపిరి ఇంతసేపు బిగపట్టి పీల్చుకున్న వాళ్లూ ఎవరూ తెలియలేదు. మరికొంత మంది ఉత్సాహవంతులు..సదరు శ్వేతాకుమారి...  పేరుతో  గూగుల్ లో సెర్చ్ చేస్తే ఆమె నటించిన తెలుగు సినిమాల లిస్ట్ రావడం లేదని వాపోతున్నారు. ఇలా ఉంది పరిస్దితి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios