అమెరికాకు చెందిన కమెడియన్, నటి విట్నీ కమ్మింగ్స్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పొరపాటున టాప్ లెస్ ఫోటోని పోస్ట్ చేసింది. తప్పు తెలుసుకొని వెంటనే తన అకౌంట్ నుండి ఆ ఫోటోని తొలగించింది. అప్పటికే ఆ ఫోటో వైరల్ అవ్వడంతో చాలా మంది స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకున్నారు.

అంతటితో ఆగకుండా ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తన టాప్ లెస్ ఫోటోని అడ్డుపెట్టుకొని కొందరు ఆకతాయిలు తనను బెదిరిస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

'నేను బాత్రూంలో లిచీ పండు తింటూ ఫోటో తీసుకున్నాను.. అయితే అందులో నా చనువులు కూడా కనిపిస్తున్నాయనే విషయాన్ని గుర్తించలేదు. ఆ ఫోటోని నేరుగా నా ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాను. కొద్దిసేపటి తరువాత కామెంట్లు చూసి షాకయ్యాను. ఫోటోని పూర్తిగా చూసి తప్పు తెలుసుకొని.. వెంటనే డిలీట్ చేశాను' అంటూ చెప్పుకొచ్చింది.

నెటిజన్లు తనను బెదిరించడంపై మాట్లాడిన విట్నీ వాళ్లపై ఫైర్ అయింది. 'మీరు నన్ను బెదిరించడం వలన మీరే చిక్కుల్లో పడతారు..' అంటూ వార్నింగ్ ఇచ్చింది. తను సెలబ్రిటీ కాబట్టి నిపుణులను, లాయర్లను సంప్రదించి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తులను రోడ్డుకు లాగి శిక్ష వేయించగలనుఅంటూ చెప్పుకొచ్చింది.

అయితే తనను బెదిరిస్తున్న వ్యక్తుల వివరాలను బయట పెట్టదలచుకోలేదని.. వారిలో కొంతమంది ఇలాంటివి పట్టించుకోని వ్యక్తులు కూడా ఉంటారని తెలిపింది.