Asianet News TeluguAsianet News Telugu

సర్దార్ ని గుర్తుపట్టలేక పోయిన బీస్ట్

ప్రస్తుతం బీస్ట్ మూవీ షూటింగ్ చెన్నైలోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతుంది. అదే స్టూడియోలో కార్తీక్ లేటెస్ట్ మూవీ సర్దార్ మూవీ షూటింగ్ జరుగుతుంది. 

when vijay not recognised karthi here is interesting story ksr
Author
Hyderabad, First Published Jul 19, 2021, 10:52 AM IST


కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ బీస్ట్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. విజయ్ బర్త్ డే కానుకగా విడుదలైన బీస్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ భారీ ఆదరణ దక్కించుకుంది. కాగా ప్రస్తుతం బీస్ట్ మూవీ షూటింగ్ చెన్నైలోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతుంది. అదే స్టూడియోలో కార్తీక్ లేటెస్ట్ మూవీ సర్దార్ మూవీ షూటింగ్ జరుగుతుంది. 

దీనితో షాట్ గ్యాప్ లో విజయ్ ని కలవడానికి కార్తీ బీస్ట్ సెట్స్ కి వెళ్లారట. అక్కడ ఉన్న విజయ్ తో మాట కలిపిన కార్తీని విజయ్ గుర్తుపట్టలేక పోయారట. సర్దార్ మూవీ కోసం కార్తీ గడ్డం పెంచి, వృద్ధుడు గెటప్ లో ఓ రోల్ చేస్తున్నాడు. అదే గెటప్ లో ఉన్న కార్తీని గుర్తు పట్టలేక పోయారట విజయ్. తరువాత అది కార్తీ అని తెలుసుకొని విజయ్ షాక్ అయ్యారట. 


చాలా సేపు ఇద్దరు హీరోలు ముచ్చటించుకున్నారని సమాచారం. సర్దార్ మూవీ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. దాదాపు రెండు కోట్ల రూపాయల ఖర్చుతూ సర్దార్ మూవీ కోసం సెట్స్ నిర్మించగా, షూటింగ్ జరుపుకుంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios