Asianet News TeluguAsianet News Telugu

'మీసాలు మెలేయడం వీరత్వమే కానీ' చిరు వీడియో

భారత్‌లో ఇప్పటికే రోజు రోజుకీ రికార్డ్ స్దాయిలో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మరో ప్రక్క తెలుగు రాష్ట్రల్లో సైతం కరోనా వైరస్‌ ప్రభావం అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో దీని నివారణకు ప్రతిఒక్కరూ తగిన చర్యలు తీసుకోవాలంటూ చిరంజీవి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కరోనా వైరస్‌ నివారణకు మాస్క్ అవసరం,  జాగ్రత్తలపై ఓ ప్రత్యేక వీడియో రూపొందించారు.ఈ వీడియోలో మాస్కుల ప్రాధాన్యత గురించి ఆయన తనదైన శైలిలో వివరించే ప్రయత్నం చేశారు.

Wear a mask, Chiranjeevis innovative campaign
Author
Hyderabad, First Published Jul 16, 2020, 11:42 AM IST

 చైనాలో మొదలై చాపకింద నీరులా ప్రపంచదేశాలకు విస్తరించి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారిపై  మెగాస్టార్‌ చిరంజీవి మరో సారి స్పందించారు. భారత్‌లో ఇప్పటికే రోజు రోజుకీ రికార్డ్ స్దాయిలో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మరో ప్రక్క తెలుగు రాష్ట్రల్లో సైతం కరోనా వైరస్‌ ప్రభావం అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో దీని నివారణకు ప్రతిఒక్కరూ తగిన చర్యలు తీసుకోవాలంటూ చిరంజీవి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కరోనా వైరస్‌ నివారణకు మాస్క్ అవసరం,  జాగ్రత్తలపై ఓ ప్రత్యేక వీడియో రూపొందించారు.ఈ వీడియోలో మాస్కుల ప్రాధాన్యత గురించి ఆయన తనదైన శైలిలో వివరించే ప్రయత్నం చేశారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అథనోమ్ ఈ నెల 13న ఓ విషయాన్ని తెలిపారని ఆయన అన్నారు. కరోనా విపత్కర పరిస్థితులు మరింత పెరిగిపోతాయని చెప్పారని గుర్తు చేశారు. దీన్ని అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి ప్రబలకుండా తమ వంతు కృషి చేయాలని, కరోనా సంక్రమణకు ముగింపు పలకాలని చెప్పారని చిరు తెలిపారు.

                                                
'అందుకే, మాస్క్ తప్పనిసరిగా ధరించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబాన్ని, దేశాన్ని కాపాడండి.. ప్లీజ్' అని చిరంజీవి ట్వీట్ చేశారు. 'మీసాలు మెలేయడం వీరత్వమే.. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు ముఖానికి మాస్కులు ధరించడం వీరుడి లక్షణం' అని పేర్కొంటూ, ఆయన మాస్కులు తప్పనిసరిగా ధరించాలని వీడియో రూపంలో సందేశం ఇచ్చారు. యంగ్‌ హీరో కార్తీకేయతో కలిసి ఆయన చేసిన ఈ వీడియో మంచి సందేశాత్మకంగా ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios