ఆ సెక్స్ రాకెట్‌కి మాకు ఎలాంటి సంబంధం లేదు: తానా

We Have No Relation With Kishan: TANA
Highlights

అమెరికాలో జరిగిన టాలీవుడ్ సెక్స్ రాకెట్‌తో తమకెలాంటి సంబంధం లేదని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) పేర్కొంది.

అమెరికాలో జరిగిన టాలీవుడ్ సెక్స్ రాకెట్‌తో తమకెలాంటి సంబంధం లేదని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) పేర్కొంది. తెలుగు సంఘాల పేరిట టాలీవుడ్ తారలను అమెరికాకు రప్పించి వారితో హైటెక్ వ్యభిచారం చేయిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో తానా ఈ ప్రకటనను విడుదల చేసింది.

మోసపూరితంగా వీసాలు సృష్టించడం మరియు వ్యభిచారం కేసులో అమెరికన్ పోలీసులు మొగుడిముడి కిషన్ మరియు అతని అనుచరులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికన్ పోలీసులు తానా అధ్యక్షులు సతీష్ వేమను నుంచి కొన్ని వివరాలను పోలీసులు కోరారు.

కిషన్ వద్ద దొరికిన తెలుగు సంఘాల లేఖల్లో తానాకు సంబంధించిన లేఖలు కూడా ఉండటంతో వాటిపై వివరణ కావాలని పోలీసులు కోరారు. దీనిపై సతీష్ స్పందిస్తూ తానా లెటర్ హెడ్స్ అన్నీ నికిలీవని, వాటిపై తాను చేసినట్లుగా ఉన్న సంతకాన్ని ఫోర్జరీ చేశారని, తమకి వాటికి ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు.

తానాకు అమెరికాలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని, ఇక్కడ తాము నిర్వహించే కార్యక్రమాలకు భారతదేశం నుంచి తెలుగు ప్రజలను, సెలబ్రిటీలను ఆహ్వానించడానికి తాము ఎలాంటి ఏజెంట్లను నియమించమని సతీష్ చెప్పారు. ఈ సెక్స్ రాకెట్ విషయంలో కిషన్‌పై మరింత ధృడమైన విచారణ జరపాలని ఆయన అన్నారు.

loader