గత ఏడాది ఫలక్ నుమా దాస్ మూవీతో హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న కుర్ర హీరో విశ్వక్ సేన్. ఇక ఇటీవల హిట్ సినిమాతో మరొక డిఫరెంట్ హిట్ అందుకున్నాడు. ఆడియెన్స్ కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉండే కథలతో సిద్దమవుతున్న ఈ కుర్ర కథానాయకుడు రెమ్యునరేషన్ డోస్ పెంచినట్లు తెలుస్తోంది.

మొదట ఈ నగరానికి ఏమైంది సినిమాతోనే విశ్వక్ చాలా మంది సినీ ప్రముఖులను ఆకర్షించాడు. నాని కూడా అతనితో 'హిట్; సినిమాను నిర్మించేందుకు సిద్దమైన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను అందుకోవడంతో విశ్వక్ రెమ్యునరేషన్ డబుల్ చేసినట్లు టాక్. ఇంతకుముందు వచ్చిన ఆఫర్స్ ముందు చేసిన అగ్రిమెంట్ ప్రకారమే పారితోషికాన్ని తీసుకుంటు.. నెక్స్ట్ అగ్రిమెంట్స్ కి మాత్రం ఎక్కువే డిమాండ్ చేస్తున్నాడట.

ఇక రీసెంట్ గా తన తదుపరి సినిమా షూటింగ్ ముగుస్తుందని చెప్పిన విశ్వక్ పాగల్ అనే రొమాంటిక్ డ్రామాలో నటిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. ఆ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుందని మొత్తంగా మూడు డిఫరెంట్ జనర్స్ లో నెక్స్ట్ ఇయర్ బ్యాక్ టూ బ్యాక్ ఫిలిమ్స్ రిలీజ్ చేయబోతున్నట్లు వివరణ ఇచ్చాడు. బెక్కం వేణుగోపాల్ - దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఆ సినిమాకు కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.