Asianet News TeluguAsianet News Telugu

స్టార్ హీరో: శ్రీరెడ్డి నాపై కూడా ఆరోపణలు చేస్తుందేమో

టాలీవుడ్ లో ముందుగా కాస్టింగ్ కౌచ్ ఉందని కామెంట్లు చేసిన నటి శ్రీరెడ్డి ఇప్పుడు తన హద్దులు 

vishal responds on srireddy nani's issue

టాలీవుడ్ లో ముందుగా కాస్టింగ్ కౌచ్ ఉందని కామెంట్లు చేసిన నటి శ్రీరెడ్డి ఇప్పుడు తన హద్దులు దాటి వ్యక్తిగతంగా కొందరిని టార్గెట్ చేస్తూ దూషిస్తుంది. బిగ్ బాస్2 లో తనకు అవకాశం వస్తే దాన్ని నాని అడ్డుకున్నట్లు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో అప్పటివరకు సైలెంట్ గా ఉన్న నాని ఆమెపై లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. నాని భార్య అంజన కూడా ఈ విషయం పట్ల తన ఆవేదన వ్యక్తం చేసింది.

తాజాగా ఈ విషయంపై స్పందించిన నటుడు విశాల్.. నానికి మద్దతుగా నిలిచాడు. 'నాని నాకు మంచి స్నేహితుడని అతడికి సపోర్ట్ చేయడం లేదు.. నానిపై శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ వివాదాస్పదం. నాని గురించి తెలిసిన వాళ్లకు అతడు ఆడవాళ్లతో ఎంత మర్యాదగా నడుచుకుంటాడో తెలుసు. ఒకవేళ ఆమె చేసే వ్యాఖ్యలు నిజమంటే ఆధారాలు చూపించాలి కదా.. శ్రీరెడ్డి వ్యవహారం చూస్తుంటే తనకు నచ్చినట్లు ఇతరులపై కామెంట్స్ చేస్తుందనిపిస్తుంది. తరువాత నాపై కూడా ఆరోపణలు చేస్తుందేమో.. మన దేశంలో లైంగిక వేధింపుల నిరోధిక చట్టాలు సరిగ్గా లేవు. ఓ మహిళ ఇతరులపై ఆరోపణలు చేస్తే వాటిని మాత్రమే పరిగణలోకి వారికి మద్దతుగా నిలుస్తోంది చట్టం. ఇది కరెక్ట్ కాదు' అంటూ వెల్లడించారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని నేను అనడం లేదు కానీ దానిని అడ్డు పెట్టుకొని పేరున్న వ్యక్తులను టార్గెట్ చేయడం సబబు కాదని స్పష్టం చేశాడు.  

Follow Us:
Download App:
  • android
  • ios