Asianet News TeluguAsianet News Telugu

షాక్: ఏపీ ప్రభుత్వ ఆన్ లైన్ సినిమా టికెటింగ్ విధానంపై విశాల్ స్పందన!

 సినీ జనాలు ఏమీ స్పందించకుండా గుంభనంగా ఉన్నారు. ఏమి మాట్లాడితే ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి  రెస్పాన్స్ వస్తుందో అని అందరూ సైలెంట్ గా ఉన్నారు. అయితే తమిళ నటుడు విశాల్ మాత్రం ఈ విషయమై మాట్లాడారు.
 

Vishal praises government online movie ticket policy
Author
Tamilnadu, First Published Sep 12, 2021, 2:05 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారం ఇప్పుడో పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.   కొన్ని నెలల కిందట ‘వకీల్ సాబ్’ విడుదల సందర్భంగా ప్రభుత్వం టికెట్ల ధరలపై నియంత్రణ తీసుకురావడం జరిగింది. ఓ ప్రక్క  కరోనాతో  సంక్షోభంలో ఉన్న పరిశ్రమ.. ప్రభుత్వ నిర్ణయంతో మరింతగా ఇబ్బందుల్లో పడింది. అనుకోని విధంగా పెద్ద సినిమాలకు ఒక్కసారిగా రెవెన్యూ పడిపోవడం జరిగింది. దాంతో భారిగా తయారైన కొత్త చిత్రాల విడుదలపై సందిగ్ధత నెలకొంది. టికెట్ల రేట్లతో పాటు ఇతర సమస్యలపై చర్చించడానికి సినీ పెద్దలను ప్రభుత్వం సమావేశం అన్నారు కానీ.. ఆ మీటింగ్ జరగలేదు.

 ఏపీలో సినిమా టికెట్ల అమ్మకం కోసం ప్రభుత్వమే ఒక బుకింగ్ పోర్టల్ తీసుకురానున్న విషయం తెలిసిందే.  ప్రభుత్వమే టికెట్లను అమ్మడం ద్వారా ఇప్పుడున్న టికెట్ బుకింగ్స్ యాప్‌లో మాదిరి ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు పెద్దగా ఉండవు. నామమాత్రపు ఛార్జీలతో టికెట్లు బుక్ చేసుకునే సౌలభ్యం కలుగుతుందనేది ఓ వాదన. ఆడియన్స్ పాయింటాఫ్ వ్యూ నుంచి  ఇది  మంచిదే. కానీ ప్రభుత్వ నిర్ణయం ఇండస్ట్రీకి షాక్ ఇచ్చినట్లైంది. 

తెలుగు పరిశ్రమ నుంచి ఏటా భారీ స్థాయిలో సినిమాలు రిలీజవుతున్నప్పటికీ.. అందుకు తగ్గట్లు పన్నులు వసూలు కావట్లేదని.. టికెట్ల అమ్మకాలపై పారదర్శకత లేకపోవడమే దీనికి కారణమని తేలిందని సమాచారం. అందుకే ఎగ్జిబిటర్లు దొంగ లెక్కలు చెప్పకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తున్నారు .  దీనిపై సినీ జనాలు ఏమీ స్పందించకుండా గుంభనంగా ఉన్నారు. ఏమి మాట్లాడితే ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి  రెస్పాన్స్ వస్తుందో అని అందరూ సైలెంట్ గా ఉన్నారు. అయితే తమిళ నటుడు విశాల్ మాత్రం ఈ విషయమై మాట్లాడారు.

''థాంక్యూ!! ఏపీలో థియేటర్లలో ఆన్ లైన్ బుకింగ్ సిస్టమ్ ను అమలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి హ్యాట్సాఫ్. తమిళనాడులో కూడా మేము ఎప్పటి నుంచో దీనిని అమలు చేయాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇది జరగడం సంతోషంగా ఉంది. ఇది 100% పారదర్శకతను తెస్తుంది కనుక ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ దీన్ని స్వాగతించాలి. తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వ రంగాలకు గొప్ప ఊరట కలిగించే థియేటర్ కలెక్షన్లలో పూర్తి పారదర్శకతను తీసుకురావడానికి ఇదే విధానాన్ని అమలు చేయాలని మన ముఖ్యమంత్రి తిరు MK స్టాలిన్ సర్ ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను'' అని విశాల్ పేర్కొన్నారు. 

 ఇక రైల్వే ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థ తరహాలో సినిమా థియేటర్ల టికెటింగ్ కోసం కూడా ప్రత్యేక పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈమేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో విధివిధానాల రూపకల్పన కోసం ప్రత్యేక కమిటీని నియమిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. హోంశాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో 8 మంది ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఛైర్మన్‌గా, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి, సమాచార శాఖ కార్యదర్శి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ , ఏపీటీఎస్ ఎండీ, కృష్ణ జిల్లా జాయింట్ కలెక్టర్ , ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శులను సభ్యులుగా నియమిస్తూ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ అమలు, బ్లూప్రింట్ రూపకల్పన బాధ్యతను ఈ కమిటీ పర్యవేక్షించనుంది. మొత్తంగా టికెటింగ్ వెబ్ పోర్టల్‌ను ఏపీ ఫిల్మ్ , టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ దీన్ని పర్యవేక్షించనుంది. మరోవైపు తెలంగాణ కూడా ఇదే బాటలో పయనిస్తుందా? లేదా? తెలియాల్సి ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios