తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే విక్రమ్ కు ప్రస్తుతం కెరీర్ లో బ్యాడ్ ఫేజ్ రన్ అవుతోంది. వరస పెట్టి సినిమాలు డిజాస్టర్స్ అవుతున్నాయి. ఈ నేపధ్యంలో తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గ కథతో ‘కోబ్రా’ అనే ప్రాజెక్టుని పట్టాలు ఎక్కించారు.  టైటిల్‌ ‘కోబ్రా’ కు సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అజయ్‌జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు.  వెరైటీ టైటిల్‌... డీమాంటీ కాలనీ, ఇమైకా నొడిగళ్‌ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడితో విక్రమ్‌ సినిమా అనగానే అభిమానులు ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈలోగా లాక్ డౌన్ తో షూటింగ్ ఆగిపోయింది. 

అనుకున్న ప్లాన్ ప్రకారం... ఈ చిత్రం టీమ్ రష్యాకు కీ షెడ్యూల్ ప్లానింగ్ కోసం వెళ్దామనుకుంది. అయితే కరోనా తో మొత్తం తల క్రిందులైంది. రష్యాలో షూటింగ్ చేసే పరిస్దితి లేదు. దాంతో ఇప్పుడు ఇక్కడే రష్యా వాతావరణం క్రియేట్ చేస్తూ సెట్స్ వేయించి షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే సెట్స్ అనేసరికి చాలా బడ్జెట్ అయ్యిపోతుందని, ఇప్పటికే విక్రమ్ మార్కెట్ అంతంత మాత్రంగా ఉండటంతో దర్శక,నిర్మాతలు ఆలోచనలో పడ్డారట.  కోబ్రా చిత్రంపై చిత్ర వర్గాల్లోనూ అంచనాలు బాగా ఉండటంతో ధైర్యం చేయాలనే ఆలోచన ఉందిట. 

చియాన్‌ విక్రమ్‌ కు జంటగా నటి శ్రీనిధి శెట్టి నటిస్తున్న ఇందులో ఇర్ఫాన్‌ పటాన్, ఆనంద్‌రాజ్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. 7 స్క్రీన్‌ స్టూడియో పతాకంపై ఎస్‌ఎస్‌.లలిత్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్ర టీమ్ ప్రకటించింది. అయితే ఇప్పుడున్న పరిస్దితుల్లో అది కష్టమే విడుదల తేదీ మారుస్తారంటున్నారు. విక్రమ్‌ కోబ్రాతో పాటు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న మరో భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌లోనూ నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే.