విజయ్ దేవరకొండ చివరగా రిలీజైన చిత్రం "వరల్డ్ ఫేమస్ లవర్".  భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా భాక్సాఫీస్ వద్ద భారీగా దెబ్బ తింది. బయ్యర్లను నిలువునా ముంచింది. విడుదలైన మొదటి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా... క్లోజింగ్ కు వచ్చేసరికి డిజాస్టర్ గా తేలింది.  విజయ్ దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇదేగా ట్రేడ్ వర్గాలు తేల్చాయి. తాజాగా ఈ సినిమా ఫైనల్ కలెక్షన్లు విడుదలయ్యాయి. ఆ లెక్కలు చూస్తే ...ఇక నిర్మాతకు ఏ సినిమా తియ్యబుద్ది కాదు అలా అనిపిస్తుంది.

ట్రేడ్ లో చెప్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమాను అడ్వాన్స్ లు ప్రక్కన పెడితే.. తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్ల రూపాయలకు  అమ్మారు. అయితే ఫైనల్ రన్ పూర్తయ్యేసరికి ఈ సినిమాకు కేవలం 8 కోట్ల 13 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. అటు ఓవర్సీస్ లోనైతే ఈ సినిమా కోటి రూపాయలు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. మొత్తానికి ఫైనల్ రన్ ముగిసేసరికి బయ్యర్లు నిండా మునిగిపోయారు.
 
ఈ లాస్ ని కవర్ చేయటానికి విజయ్ దేవరకొండ తన రెమ్యునేషన్ లో కొంత భాగం వెనక్కి నిర్మాతకు ఇచ్చేసినట్లు సమాచారం. అలాగే నిర్మాత కెఎస్ రామారావు తనను నమ్మి సినిమాని మంచి రేట్లకు కొనుక్కున్న బయ్యర్లు కు ఏ విధంగా రికవరీ ఇవ్వబోతున్నారనేది తెలియాల్సి ఉంది. అయితే తను తదుపరి తీసే చిత్రాన్ని తక్కువ రేట్లుకు ఇప్పుడు నష్టపోయినవారందిరికీ ఇస్తానని నిర్మాత ...చెప్తున్నా...డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకోలేదని చెప్తున్నారు. దాంతో తిరిగి వెనక్కి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్దితి ఉంది.