మహేష్ ఆ విషయంలో చాలా వీక్.. విజయనిర్మల షాకింగ్ కామెంట్స్!

vijayanirmala comments on mahesh babu
Highlights

మహేష్ బాబు ఎన్ని సినిమాలు చేసినా.. హీరోయిన్ల కళ్లల్లో కళ్లు పెట్టి చూడడం, వారితో రొమాంటిక్ సీన్స్ లో నటించే విషయంలో ఇప్పటికీ మహేష్ చాలా వీక్ అంటూ చెప్పుకొచ్చింది. ఇవి సూపర్ స్టార్ కృష్ణ పోలికలే అని చెబుతూ నవ్వేశారు

సూపర్ స్టార్ మహేష్ బాబుకి తన తండ్రితో ఉన్న సాన్నిహిత్యం గురించి అలానే వీరిద్దరి మనస్తత్వాలు ఎలా ఉంటాయనే విషయంపై కృష్ణ భార్య విజయనిర్మల కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేవలం రూపంలో మాత్రమే కాదు.. ఇద్దరి మనస్తత్వాలు కూడా చాలా దగ్గర ఉంటాయని అన్నారు. అమ్మాయిల విషయంలో ఇద్దరూ వీకే అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

మహేష్ బాబు ఎన్ని సినిమాలు చేసినా.. హీరోయిన్ల కళ్లల్లో కళ్లు పెట్టి చూడడం, వారితో రొమాంటిక్ సీన్స్ లో నటించే విషయంలో ఇప్పటికీ మహేష్ చాలా వీక్ అంటూ చెప్పుకొచ్చింది. ఇవి సూపర్ స్టార్ కృష్ణ పోలికలే అని చెబుతూ నవ్వేశారు. గతంలో కృష్ణకి దగ్గరవ్వాలని చాలా మంది హీరోయిన్లు ప్రయత్నించారు. కానీ కృష్ణ వారు పేర్లు చెబితేనే పారిపోయేవారు. మహేష్ పరిస్థితి కూడా ఇంతే అంటూ జోక్ చేశారు.

వేరే అమ్మాయిలతో మాట్లాడేప్పుడు కృష్ణ తలవంచుకొని మాట్లాడతారు.. మహేష్ ది కూడా అదే పద్ధతి. మహేష్ లాంటి కొడుకు ఉండడం ఎవరికైనా అదృష్టం అంటూ అతడి పట్ల తన ప్రేమను చాటుకుంది. ఇక కృష్ణ బయోపిక్ చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నప్పటికీ ఆ పాత్రలో నటించగల స్థాయి ఉన్న హీరో ఎవరూ లేకపోవడంతో ఆ సినిమాను తీయలేకపోతున్నాను అని బాధను వ్యక్తం చేశారు. 

loader