సాధారణంగా తమిళ స్టార్ హీరో విజయ్ చాలా కూల్ గా ఉంటాడు. ఎన్నో వివాదాలు తనపై వచ్చినప్పుడు కూడా నిబ్బరం చెదరకుండా వాటిని చెదరకొట్టి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ఓ విషయం మాత్రం ఆయన్ని చాలా బాధపెట్టిందిట. దాంతో తన తాజా చిత్రం మాస్టర్ నిర్మాతలపై ఆయన ఓ రేంజిలో ఫైర్ అయినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిర్మాతలను లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చినట్లు, ఏం నేను మీకు ఎలా కనపడుతున్నానంటూ కన్నెర్ర చేసినట్లు  చెప్పుకుంటున్నారు. ఇంతకీ విజయ్ కు అంతలా కోపం తెచ్చిన సంఘటన ఏమిటీ అంటే...

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్‌తో దేశంలోని అన్ని రంగాలపై భారీగా దెబ్బపడింది. ముఖ్యంగా కోట్లతో బిజినెస్ జరిగే గ్లామర్ ఫీల్డ్ చెప్పుకోలేనంత నిరాశలో కూరుకుపోయింది. పెద్ద, చిన్న అనే తేడా లేకుండా నిర్మాతలు అంటూ తాము పెట్టిన పెట్టుబడి వడ్డీతో సహా కాకపోయినా, లాభాలు రాకపోయినా రాబట్టుకోగలమా అనే ఆలోచనలో పడిపోతున్నారు. చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు అన్నీ కూడా సమస్యలు ఎదుర్కుంటున్నాయి. 

ఈ నేపధ్యంలో తాము తీసిన మూవీ అనుకున్న సమయానికి విడుదల కాకపోతే కోట్లలో నష్టం వస్తుంది కాబట్టి.. చాలామంది నిర్మాతలు డిజిటల్ స్ట్రీమింగ్‌లలో రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు. అయితే అది హీరోలకు గిట్టడం లేదు. ఈ విషయం గమనించి చాలా మంది పెద్ద నిర్మాతలు సైలెంట్ గా ఉంటున్నారు. కానీ కొందరు మాత్రం ఓటీటి ప్లాట్ ఫామ్ వాళ్లు ఇస్తున్న రేట్లు కు టెమ్ట్ అవుతున్నారు.అలా రీసెంట్ గా  దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ‘మాస్టర్’ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు దగ్గరకు ప్రపోజల్ వచ్చిందిట. 

అందుకు వాళ్లు చెల్లించే మొత్తం కూడా కళ్లు చెదిరే స్దాయిలో ఉందిట. దీనికి మొదట నిర్మాతలు నో అనుకున్నా...మెల్లిమెల్లిగా కరోనా ఎప్పుడు వెళ్తుందో అర్దం కాని సిట్యువేషన్ లో ఈ సినిమాని అమెజాన్ కు ఇచ్చేద్దామా అని ఆలోచనలో పడ్డారట. దాంతో తమ హీరో దళపతి విజయ్ దగ్గర ఈ ప్రపోజల్ పెట్టారట. అయితే అసలు ఇలాంటి ప్రపోజల్ తనదాకా వస్తుందని ఊహించని విజయ్ ఓ రేంజిలో ఫైర్ అయ్యారట. అసలు నా ఇమేజ్ ఏమిటి...నా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమిటి.. డిజిటిల్ స్ట్రీమింగ్ లో డైరక్ట్ రిలీజ్ చేస్తే రేపు నా పరిస్దితి ఏమిటి.. ఒక్క సెకన్ కూడా ఆలోచించలేదా....అంతగా అవసరం అయితే నేనే సినిమా ని థియోటర్స్ లో రిలీజ్ చేస్తాను ...మీరు మాత్రం ఇలాంటి ప్రపోజల్స్ నా దగ్గరకు తేకండి అని వార్నింగ్ ఇచ్చారట.