సాయి తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌  హీరోగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాతో  దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌,ఫస్ట్ లుక్ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 

ప్రీలుక్‌లో మత్స్యకారుడి గెటప్‌లో మాస్‌ లుక్‌తో కనిపించి వైష్ణవ్‌ సినీ ప్రియులను మెప్పించారు.అలాగే ఫస్ట్ లుక్ లో  వైష్ణవ్‌ మాస్‌, లవర్‌బాయ్‌ లుక్‌లో కనిపించారు. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జంటగా కృతిశెట్టి నటిస్తున్నారు. అంతేకాకుండా విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడీ చిత్రంలో విజయ్ సేతుపతి లుక్ ని వదిలారు.

ఇక చేతిలో సిగరెట్‌ పట్టుకొని కుర్చిలో కూర్చున్న విజయ్‌ సేతుపతి మాస్‌లుక్‌ ఫ్యాన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది. సినిమాపై అంచనాలు పెంచుతోంది. ‘రాయనం' అనే డిఫరెంట్ పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నాడు.  

 మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థతోపాటు సుకుమార్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. ఏప్రిల్‌ 2న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేద్దామనుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్దితుల్లో ఎప్పుడు రిలీజ్ అనేది చెప్పలేని పరిస్దితి ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది.