తమిళ స్టార్ హీరో విజయ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మాస్టర్‌’.కార్తి నటించిన  ‘ఖైదీ’ చిత్రానికి డైరక్షన్ చేసి స్టార్ గా మారిన లోకేశ్‌ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి కీలకపాత్రలో నటించారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ‘మాస్టర్‌’ సినిమా విడుదల లేటవుతోంది. అయితే రీసెంట్ గా తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చిన ఫర్మిషన్స్ మేరకు ‘మాస్టర్‌’ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను పూర్తి చేసుకుంటోంది. అలాగే సోషల్ డిస్టెన్స్, ఇతర రూల్స్ పాటిస్తూ జులై నుంచి థియేటర్లు తిరిగి ఓపెన్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతివ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

 

ఈ నేపథ్యంలో థియేటర్లు ఓపెన్‌ కాగానే మొదటి చిత్రంగా ‘మాస్టర్‌’ విడుదల చేయాలని థియేటర్‌ ఓనర్స్ భావిస్తున్నారు. ‘మాస్టర్‌’ రిలీజ్ అయితే ఆ షోలతో థియేటర్లు, ప్రేక్షకులతో కళకళలాడతాయని భావిస్తున్నారు. అయితే, సీనియర్‌ దర్శకుడు, నిర్మాతల మండలి మాజీ అధ్యక్షుడు కేయార్‌.. ‘మాస్టర్‌’ విడుదల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశారు. థియేటర్లు పునఃప్రారంభమైన వెంటనే మొదటిగా ‘మాస్టర్‌’ చిత్రాన్ని ప్రదర్శించడానికి అనుమతివ్వవద్దని కోరారు. ఆ చిత్రాన్ని విడుదల చేస్తే ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని, దానివల్ల కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశముందని, అదే జరిగితే విజయ్‌కి ఉన్న మంచిపేరు పోతుందని పేర్కొన్నారు.

 

ఆర్థిక వ్యవస్థ కంటే ముందు ప్రజల సంక్షేమం ముఖ్యమని ఆయన తెలిపారు. అంతేకాకుండా సినీ నిర్మాతలకు విధించే 26 శాతం వినోద పన్ను.. రానున్న మూడు నెలలు మాఫీ చేయాలని కోరారు. ‘మాస్టర్‌’ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ‘వాతి కమ్మింగ్‌’ అనేపాట ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పాట 50 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్‌ సొంతం చేసుకుని యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది.