కీర్తి సురేష్: హీరోని కాళ్లతో తొక్కుతోంది!

vijay - keerthy suresh photo goes viral
Highlights

తెలుగులో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ అనే క్రేజ్ ను దక్కించుకుంది కీర్తి సురేష్.

తెలుగులో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ అనే క్రేజ్ ను దక్కించుకుంది కీర్తి సురేష్. 'మహానటి' సినిమా ఆమె స్థాయిని అమాంతం పెంచేసింది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బిజీ హీరోయిన్ గా గడుపుతోంది. అయితే కీర్తి హీరో విజయ్ ను కాళ్లతో తొక్కుతూ కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తమిళులు తమ అభిమాన హీరోలను ఎంతో ఆరాధిస్తుంటారు.

తము ఎంతగానో అభిమానించే హీరో విజయ్ కాళ్లపై కీర్తి తన పాదం మోపడంతో వాళ్లు ఆగ్రహానికి గురవుతున్నారు. అసలు విషయంలోకి వస్తే.. విజయ్, కేర్థిఒ జంటగా మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ ను విడుదల చేశారు. ఓ ఫోటోలో కీర్తి సోఫా మీద కూర్చొని నేలపై కూర్చొని ఉన్న విజయ్ కాలి వేళ్లపై తన కాలు పెట్టింది.

ఈ ఫోటో కాస్త విజయ్ అభిమానుల కంట పడడంతో కీర్తిపై మండిపడుతున్నారు. కీర్తి నీకు ఇంత పొగరా అంటూ ఆమెపై కామెంట్ల వర్షం  కురిపిస్తున్నారు. మరోపక్క కీర్తి అభిమానులు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.  

 

loader