అవసరాల్లో ఉన్నవారికి సాయం అందించటంలో విజయ్ దేవరకొండ ముందుంటాడనే విషయం అందరికీ తెలిసు. ఆయన తన ఛారిటీల కోసం ఓ ఆర్గనైజేషన్ కూడా నెలకొల్పారు. అలాగే వరదలు, తుఫానులు వంటివి వచ్చినప్పుడు కూడా తన పెద్ద మనస్సు చాటుకున్నారు. అయితే కరోనా ఛారిటీ విషయంలో ఆయన ఎందుకు సైలెన్స్ గా ఉన్నారో ఎవరికీ అర్దం కావటం లేదు.

ఇండస్ట్రీలోని పెద్ద స్టార్స్ అంతా కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి) అంటూ ఫండ్ రైజ్ చేస్తూంటే ..విజయ్ దేవరకొండ ముందుకు రాకపోవటం ఆశ్చర్యంగా ఉంది. అలాగే మిగతా హీరోలు సిఎం రిలీఫ్ ఫండ్ కు డబ్బును అందచేస్తున్నారు. అలా కూడా విజయ్ దేవరకొండ తన డొనేషన్ ప్రకటించలేదు. అయితే తెలంగాణా గవర్నమెంట్ కోరిక మేరకు.. ప్రజలను హైజనిక్ గా ఉండమని, చేతులు కడుక్కోమని,కరోనా నుంచి తప్పించుకోమంటూ ఓ వీడియో అయితే చేసారు. ఆ క్రమంలోనే విజయ్ దేవరకొండ తన డొనేషన్ ప్రకటిస్తారని అంతా భావించారు. అయితే అదేమీ జరగలేదు.ఎందుకు ఆయన ఆగుతున్నారనేది మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

అయితే డబ్బుగా ఇవ్వకుండా డాక్టర్స్ కు కిట్ క్రింద విజయ్ దేవరకొండ ఛారిటీ చేయబోతున్నారంటూ ఓ వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందులో నిజమెంతో తెలియలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ..ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఆ సినిమా కోసం నలభై రోజుల లాంగ్ షెడ్యూల్ ముంబైలో పాల్గొని రీసెంట్ గా వచ్చారు. బాక్సింగ్ క్రీడ చుట్టూ తిరిగే ఈ కథ ..విజయ్ దేవరకొండ కెరీర్ ఓ ప్రత్యేక చిత్రంగా మిగులుతుందని చెప్తున్నారు. అయితే కరోనా దెబ్బతో షూటింగ్ ఆగింది. ఈ వైరస్ విషయం తేలాక మళ్ళీ షూటింగ్ లు మొదలయ్యాక, మిగతా సినిమా పూర్తి చేసి రిలీజ్ చేస్తారు.