Vijay Devarakonda:వామ్మో అవేం బూతులు.. మరోసారి హాట్ టాపిక్ గా విజయ్ దేవరకొండ యాటిట్యూడ్


విజయ్ దేవరకొండ (Vijay Devarakond)యాటిట్యూడ్ మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. మీడియాలో ఆయన పెళ్లి గురించి వస్తున్న వార్తలు ఖండించే క్రమంలో విజయ్ దేవరకొండ వాడిన భాషకు పచ్చి బూతులు వాడే నెటిజెన్స్ కూడా షాక్ అయ్యారు. 

vijay devarakonda tweet with cuss words hot topic in social media

విజయ్ దేవరకొండ యాటిట్యూడ్, బిహేవియర్ పలుమార్లు వార్తలకెక్కింది. ఫేమస్ అయిన ప్రతి సెలెబ్రిటీకి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.రౌడీ యాటిట్యూడ్, లెక్కచేయని తత్వం విజయ్ దేవరకొండ ప్రత్యేకత. రౌడీ హీరో అని గొప్పగా పిలిపించుకునే విజయ్ దేవరకొండ... ఆ పేరున ఓ బ్రాండ్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు. రౌడీ బ్రాండ్ బట్టలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. పబ్లిక్ లో ఒద్దికగా ఉండాలి, డిప్లొమాటిక్ గా మాట్లాడాలి అనేది సెలెబ్రిటీలు ఫాలో అయ్యే సూత్రం. దీనికి భిన్నం విజయ్ దేవరకొండ. పబ్లిక్ వేదికలపై కూడా తన అగ్రెసివ్ నేచర్ చూపిస్తాడు. 

నిజానికి ఇది ఒక మార్కెటింగ్ టెక్నీక్. సొంతగా ఓ ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నం. ఆయన్ని ఫేమస్ చేసింది కూడా అదే. ఆయనలా రౌడీ యాటిట్యూడ్ తో బ్రతకాలని, విజయ్ దేవరకొండను అనుసరించే యూత్ లక్షల్లోనే ఉన్నారు. నెగిటివ్ యాటిట్యూడ్ తో ఫేమస్ కావడం కొత్త ట్రెండ్. అర్జున్ రెడ్డి మూవీలో ఎవరినీ లెక్క చేయని యువకుడిగా విజయ్ చేసిన పాత్ర ఆయనను ఓవర్ నైట్ స్టార్ చేసింది. బయట కూడా విజయ్ దేవరకొండ అలానే ఉంటాడనే ప్రచారం మరింత ఇమేజ్ తెచ్చిపెట్టింది. మరి తనకు అంతటి ఇమేజ్ తెచ్చిపెట్టిన మేనరిజం, యాటిట్యూడ్ వదిలేస్తే ఎలా... అందుకే ఆయన వదలకుండా మైంటైన్ చేస్తున్నారు. 

అసలు మీడియా అంటే విజయ్ దేవరకొండకు కొంచెం కూడా సదాభిప్రాయం ఉండదు. ఆ మధ్య కొన్నాళ్ళు మీడియా రాతలకు వ్యతిరేకంగా చిన్న యుద్ధమే చేశాడు. ఈ పోరాటంలో ఆయనకు మద్దతుగా కొందరు టాలీవుడ్ స్టార్స్ నిలిచారు. అయితే మీడియా పుకార్లను తిప్పికొట్టే క్రమంలో విజయ్ దేవరకొండ వాడిన భాష ఆయన అభిమానులను కూడా విస్మయానికి గురిచేసింది. లౌ** న్యూస్ అంటూ లిటరల్ గా పచ్చి బూతు వాడేశారు. అంత పెద్ద సెలబ్రిటీ ఈస్థాయి బూతు పబ్లిక్ గా వాడటం పెద్ద చర్చకు దారి తీసింది. 

ఇక విజయ్ దేవరకొండ లెక్క చేయని తనానికి, వాడుతున్న భాషకు ఆయన డై హార్డ్ ఫ్యాన్స్ ఫిదా అవుతుంటే, మరో వర్గం ఇంత దారుణమైన బూతు వాడటం అవసరమా అంటున్నారు. ఆయన యాంటీ ఫ్యాన్స్ స్పందన మరోలా ఉంది. విజయ్ దేవరకొండ బూతు ట్వీట్ క్రింద కామెంట్స్ రూపంలో పెద్ద చర్చ నడుస్తుంది. సందులో సడేమియా అన్నట్లు విజయ్ దేవరకొండ తిడుతుంది యూవీ క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ నే అంటూ ప్రభాస్, పవన్ ఫ్యాన్స్ సదరు నిర్మాణ సంస్థలను ట్యాగ్ చేస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios