విజయ్‌ దేవరకొండకి అల్లు అర్జున్‌ ఎంతగానో సపోర్ట్ చేశాడు. `గీతగోవిందం` సినిమా బ్లాక్‌ బస్టర్‌ టైమ్‌లో ప్రత్యేకంగా అభినందించాడు. అంతేకాదు యూనిట్‌కి స్పెషల్‌ పార్టీ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత `టాక్సీవాలా`  సినిమా సమయంలోనూ సహకరించాడు. దీంతో వీరి మధ్య మంచి బాండింగ్‌ ఏర్పడింది. ఆ బాండింగ్‌ ఒకరినొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకునేంతగా పెరిగింది. 

తాజాగా బన్నీకి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ పంపించాడు రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ. తన రౌడీ వేర్‌ నుంచి ప్రత్యేకంగా డిజైన్‌ చేయబడ్డ టీషర్ట్, స్పెషల్‌ ట్రాక్‌, డిజైన్‌ మాస్కులను పంపించాడు విజయ్‌ దేవరకొండ. ఈ గిఫ్ట్ ని అందుకున్న బన్నీ ఇన్‌స్టా స్టోరీస్‌లో విజయ్‌కి థ్యాంక్స్ చెప్పాడు. `థ్యాంక్యూ సో మచ్‌ విజయ్‌. రౌడీ నుంచి నువ్వు పంపిన లేటెస్ట్ కలెక్షన్లు సో స్వీట్‌` అని తెలిపారు. 

విజయ్‌ ప్రస్తుతం `ఫైటర్‌` చిత్రంలో నటిస్తున్నారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది.  ఇక అల్లు అర్జున్‌ సుకుమార్‌ దర్శకత్వంలో `పుష్ప` చిత్రంలో నటిస్తున్నాడు. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా, ఇది కూడా పాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతుండటం విశేషం.