Asianet News Telugu

రివ్యూ: విద్యా బాలన్ 'శకుంతల దేవి'

అత్యంత వేగంగా అంకెలను గణించి రికార్డు సృష్టించిన భారత గణిత మేధావి స్వర్గీయ శంకుతలా దేవీ పేరిట గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ క్రియేట్ చేసారు. నలభై ఏళ్ల క్రితం శకుంతలా దేవి ఈ రికార్డు నమోదు చేశారు. రెండు 13 అంకెల సంఖ్యలను గుణించి 28 సెకన్ల వ్యవధిలోనే సమాధానం చెప్పి సంచలనం సృష్టించారు. ఆమె జీవితం ఆధారంగా తెర‌కెక్కిన విద్యాబాల‌న్ సినిమా 'శ‌కుంత‌లా దేవి' ఈ రోజు విడుద‌ల అయ్యింది. అయితే అందరికీ ఆమె చేసిన లెక్కల,గుణించం,వేగం గురించే తెలుసు. కానీ అసలు ఎవరు ఆమె..ఏం చదువుకున్నారు. హ్యూమన్ కంప్యూటర్ గా ఎదిగిన ఆమె జీవిత లెక్కలు ఏమిటి వంటి విషయాలు రివ్యూలో పరిశీలిద్దాం

Vidya Balan Shakuntala Devi movie review
Author
Hyderabad, First Published Jul 31, 2020, 4:18 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

4,45,93,729 ను 5,87,22,136తో గుణిస్తే ఎంత? 
అంత పెద్ద లెక్కను మెదడులో ఆలోచించి చెప్పగలరా...అందరిలో టెన్షన్ ..కానీ ఈ లెక్కను బోర్డుపై రాయడానికి పట్టిన టైమ్ కన్నా త‌క్కువ టైమ్ లోనే ఆమె స‌మాధానం చెప్పటానికి సిద్దపడ్డారు. అంతేకాదు ఈ గణించిగా వచ్చిన సంఖ్యను ఎడ‌మ నుంచి కుడికి రాయ‌మంటారా? లేక కుడి నుంచి ఎడ‌మ‌కు రాయ‌మంటారా? అని ప్ర‌శ్నించారు. అందరూ ఆశ్చర్యపోయారు. దాదాపు కొంచెం అటూ ఇటూలో ఇలాంటి సంఘటనే ఓ టీవి షోలో జరిగింది. ఆ సమాధానం చెప్పినామె శుకుంతలా దేవి. ఆమెను హ్యూమన్ కంప్యూటర్ అంటారు.

అత్యంత వేగంగా అంకెలను గణించి రికార్డు సృష్టించిన భారత గణిత మేధావి స్వర్గీయ శంకుతలా దేవీ పేరిట గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ క్రియేట్ చేసారు. నలభై ఏళ్ల క్రితం శ కుంతలా దేవి ఈ రికార్డు నమోదు చేశారు. రెండు 13 అంకెల సంఖ్యలను గుణించి 28 సెకన్ల వ్యవధిలోనే సమాధానం చెప్పి సంచలనం సృష్టించారు.  ఆమె జీవితం ఆధారంగా తెర‌కెక్కిన విద్యాబాల‌న్ సినిమా 'శ‌కుంత‌లా దేవి' ఈ రోజు విడుద‌ల అయ్యింది. అయితే అందరికీ ఆమె చేసిన లెక్కల,గుణించం,వేగం గురించే తెలుసు. కానీ అసలు ఎవరు ఆమె..ఏం చదువుకున్నారు. హ్యూమన్ కంప్యూటర్ గా ఎదిగిన ఆమె జీవిత లెక్కలు ఏమిటి వంటి విషయాలు రివ్యూలో పరిశీలిద్దాం. 
 
తెరపై చెప్పబడ్డ ఆమె జీవితం ఇదీ
చిన్నప్పటి నుంచి శకుంతలాదేవి (విద్యా బాలన్)  అసాధారణమైన ప్రతిభను ప్రదర్శించేది. లేని కుటుంబంలో పుట్టినా ఎప్పుడూ ఆమెలో ఆ బాధ లేదు. తన మేధస్సుతో ప్రపంచాన్ని జయంచటం మొదలెట్టి..ఆ ప్రస్దానం కొనసాగించటమే పనిగా పెట్టుకుంది.  శకుంతలాదేవి తండ్రి మార్గదర్శకత్వంలో మ్యాథ్స్ జీనియస్ గా రాణిస్తుంది. అయితే తండ్రి(ప్రకాష్ బెల్వాడి) ఆమెను షోలకు తీసుకెళ్తూ కనీసం స్కూల్ కు కూడా పంపకపోవటం,తోటి పిల్లలతో బాల్యం ఆనందంగా గడపకలేకపోవటంతో జీవితంలో పెద్ద వెలితిగా అనిపిస్తూంటుంది. అందరిలా బాల్యాన్ని ఆస్వాదించే అవ‌కాశం ఆమెకి ద‌క్క‌లేదు.ఓ వయస్సు వచ్చాక అందరిలాగే ఆమె కూడా ఓ వ్యక్తితో ప్రేమలో పడుతుంది. అతను మోసం చేస్తాడు. దాని నుంచి బయిటపడటానికి అన్నట్లు ఆమె లండన్ వెళ్తుంది. అక్కడ పరిచయమైన స్పానిష్ దేశస్థుడు జేవియర్(లుసా కల్వాని)సహాయంతో ప్రపంచ వ్యాప్తంగా పేరుతెచ్చుకుంది. ఆ తర్వాత తను ఆమె జీవితంలోంచి వెళ్ళిపోతాడు.

ఆ క్రమంలో  పరిచయమైన పరితోష్ బెనర్జీ (జిస్సు సేన్ గుప్తా)తో ప్రేమలో పడి..పెళ్లికి దారి తీస్తుంది. ఓ పాప పుట్టాక వీళ్ల సాంసారిక జీవితంలో విభేధాలు మొదలవుతాయి. అవి పెరిగి కలిసి ఉండలేమనే నిర్ణయానికి వచ్చేస్తారు. కూతురు అనుపమ(సాన్య మల్హోత్రా) తండ్రికు దూరమైన బాధ తల్లి శకుంతల మీద ద్వేషం పెంచుకుని తండ్రి దగ్గరకు వెళ్లిపోతుంది.  ఆ తర్వాత నాటకీయంగా జరిగిన కొన్ని పరిణామాల తర్వాత శకుంతల మీదే అనుపమ క్రిమినల్ కేసు పెట్టేదాకా స్థితి వస్తుంది. అసలేం జరిగింది,  శకుంతలాదేవి జీవితంలో ఏర్పడిన ఇబ్బందులను ఎలా ఎదుర్కొంది.చివరకు భర్త, కూతురు దగ్గరకు వెళ్లిందా..ఇవన్నీ ఆమె వృత్తిపరమైన జీవితంపై ప్రభావం చూపించాయా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.  
 
ఎలా ఉంది...
మనకు బయోపిక్ లు కొత్తేమీ కాదు. అయితే అవి ప్రేరణ పొందే విధంగా ఉంటే అందరికీ ఆనందం. లేకపోతే ఆ బయోపిక్ తీసిన డైరక్టర్ ఒక్కడికే ఆనందం. అదే  హ్యూమన్‌ కంప్యూటర్‌గా పేరుగాంచిన శకుంతల దేవి జీవిత కథ కూడా తెరకెక్కించారు. అయితే  గణితంలో అసమాన ప్రతిభ కలిగిన ఆమె కథతో చిత్రం వస్తోందంటే ఆసక్తే కానీ, గణితానికి, జీవిత గణితానికి సంభంధం లేదు.  అలాగే ఆమె జీవితంలో తెరపై ఎక్కించేటంత డ్రామా లేదు. ఉన్న కొద్దిపాటి ఎలిమెంట్స్ ఆమె గణిత జీవితంపై ఏ విధమైన ప్రభావం చూపనివే. డ్రామా లేని కథలు చూడాలంటే కాస్తంత ఇబ్బందే. అంత గొప్ప గణిత మేధావి అనే యాంగిల్ నుంచి జీవిత చరిత్రను చూస్తే భర్తతో విడాకులు, కన్నబిడ్డ తనకు ఇష్టపడకపోవడం అనే ఎలిమెంట్స్ తప్పించి ఏమీ లేవు..చూపలేదు. అవి ఆమె పర్శనల్ అంత చెప్పుకోదగినవి కాదు..ఆమె శిఖరం. దాని ముందు ఈ సమస్యలు అనేవి చాలా చాలా చిన్నవి అనిపిస్తాయి. అలాగే ఆమె పర్శనల్ లైఫ్ పై ఫోకస్ తగ్గించి, ఆమె జీవితంపై మరికాస్త రీసెర్చ్ చేసి ఆవిడకు ఎదురైన అరుదైన సంఘనటల సమాహారంగా ఈ సినిమాని మలిచి ఉంటే ఇంకా బాగుండేది. ఓ గణిత శాస్త్రవేత్త అనే ఎలిమెంట్ ని తీసేస్తే...ఇది టీవి సీరియల్ కథే అనిపించకమానదు. అదే సమయంలో గణిత శాస్త్రవేత్త గా ఆమె చెసే అద్భుతాలు అంత ఎఫెక్టివ్ గా తెరపై చూపలేకపోయారు.  

నటీనటులు, దర్శకత్వం
బయోపిక్ ల్లో విద్యాబాలన్ అద్బుతం చేసేస్తుందని డర్టీ పిక్చర్ చూసినప్పుడే అర్దమయ్యింది. ఆమె పాత్రలోకి ప్రవేశిస్తుంది కానీ..కేవలం ఆ పాత్ర రూపు రేఖల్లోకి ప్రవేశించదు. దాంతో ఆ పాత్ర ఆమె అయ్యి...ఆ లక్షణాలు, ఆ వ్యక్తిత్వం తెరపై ఆవిష్కారమవుతాయి. అదే శకుంతలాదేవికు కూడా జరిగింది. విద్యాబాలన్ ...తన డిగ్నిటీతో కూడిన నటనతో ఆమే..ఈమె అనిపించేలా చేసారు. ఫొటోలు ఒకేలా ఉండకపోవచ్చు కానీ శకుంతాలా దేవి పూనిందేమో అన్నంతలా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేసింది. దర్శకురాలు అనూ మీనన్ ..మొదట సక్సెస్ కూడా ఈ సినిమాకి విద్యాబాలన్ ని ఒప్పించటమే. అయితే ఈ స్క్రిప్టు ఈ డ్రామా సరిపోదు. మరింతగా రీసెర్చ్ చేసి ఆమె జీవితంలో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ని ఒడిసి పడితే బాగుండేది. 

టెక్నికల్ గా..
ఇలాంటి పీరియాడిక్ బయోపిక్ లకు ఉన్న ఒకే ఒక కష్టం. ఆ కాలం నాటి వాతావరణం క్రియేట్ చేయటం. ఆ విషయంలో టీమ్ సక్సెస్ అయ్యింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.సచిన్-జిగర్ సంయుక్తంగా కంపోజ్ చేసిన పాటలు జస్ట్ ఓకే. అయితే థియోటర్ లో వాటిని చూడగలిగే వాళ్లమేమో కానీ ఇక్కడ కర్సర్ తో ముందుకు తోసేస్తాం. కరణ్ కులకర్ణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చారు. కేల్కో నకహార కెమెరా వర్క్ బాగా ప్లస్ అయ్యింది.  అంతర లాహిరి ఎడిటింగ్ కాస్త లాగ్ లు తొలిగిస్తే బాగుండేది.

 
ఫైనల్ ధాట్
హోమోసెక్సువాలిటీ గురించి ఆలోచించటాన్ని, మాట్లాడటాన్ని పెద్ద నేరంగా భావించే1970ల్లో ఆమె దానిపై పుస్త‌కం కూడా రాశారు. ఇలాంటి మరెన్నో విషయాలు ఆమె జీవితలో ఉన్నాయి. ఈ సినిమాలో స్పృశిస్తే బాగుండేది. 

 

---సూర్య ప్రకాష్ జోశ్యుల

Rating: 2.5/5

Follow Us:
Download App:
  • android
  • ios