లెజెండరీ గాయని అనురాధ పౌడల్ తనయుడు ఆదిత్య పౌడల్‌ ముంబైలో మృతి చెందారు. ఆయన వయసు కేవలం 35 సంవత్పరాలే. ఈ విషయాన్ని బాలీవుడ్ సింగర్ శంకర్‌ మహాదేవన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. కొద్ది రోజులు ఆదిత్య కిడ్ని సంబంధ వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. పరిస్థితి విషయమించటంతో శనివారం తుది శ్వాస విడిచిట్టుగా వెల్లడించారు.

`ఆదిత్య పౌడల్ మృతి వార్త ఎంతగానో బాధించింది. ఆయన ఎంతో గొప్ప మ్యూజీషియన్‌. ఎంతో ప్రేమగా ఉండేవాడు ఆయన హాస్య చతురత కూడా అద్భుతం. మేం చాలా ప్రాజెక్ట్స్ కోసం కలిసి పనిచేశాం. ఆయన ఆత్మ శాంతి కోసం ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా` అంటూ తన సోషల్ మీడియా పేజ్‌లో బాధను వ్యక్తపరిచాడు శంకర్ మహదేవన్.

శంకర్‌ మహాదేవన్‌ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ ఆదిత్య చాలా ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని చెప్పాడు. ఆయనకు ఆరోగ్య సమస్యల కారణంగా హైపర్‌ టెన్షన్‌కు గురయ్యేవాడు, ఆయనకు ఊపరితిత్తుల సమస్య కూడా ఉంది. కానీ చివరకు కిడ్నీ ఫెయిల్యూర్‌ కారణంగా మరణించాడు. గత నాలుగు రోజులుగా ఐసీయూలో ఉన్న ఆదిత్య ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారని చెప్పాడు.