విక్టరీ వెంకటేష్ ఇటీవల వెంకిమామ సినిమాతో పాజిటివ్ టాక్ అందుకున్న విషయం తెలిసిందే.  నాగ చైతన్యతో కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ వెంకీమామ క్రిస్మస్ సెలవులను ఉపయోగించుకొని మంచి కలెక్షన్స్ ని అందుకుంది. అయితే నిర్మాత సురేష్ బాబుకి అనుకున్నంతగా బాక్స్ ఆఫీస్ వద్ద లాభాలని అందించలేకపోయింది.

ఓపెనింగ్స్ కలెక్షన్స్ అయితే గట్టిగానే వచ్చినప్పటికీ అదే ఫ్లోను కొనసాగించలేకపోయింది.  ఇకపోతే సినిమాకు సంబందించిన మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటె సినిమాను చూసిన కొంతమంది బాలీవుడ్ నిర్మాతలు సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. సురేష్ బాబుకు మంచి ఫ్యాన్సీ రేట్ ని కూడా అఫర్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే బాలీవుడ్ లో సినిమా స్క్రీన్ ప్లేను కాస్త మార్చే అవకాశం ఉన్నట్లు టాక్.  కోలీవుడ్ లో కూడా సినిమాని రీమేక్ చేయడానికి కొంతమంది హీరోలు ఆసక్తి చూపుతున్నారట. ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియదు గాని తెలుగులో అయితే వెంకిమామ అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. మరి బాలీవుడ్ కోలీవుడ్ లో సినిమా రిలీజయితే ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. వెంకిమామ సినిమాకు బాబీ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. థమన్ సంగీతం అందించగా రాశి ఖన్నా - పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించారు.