వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ నటించిన `ఎఫ్‌2` రెండేళ్ల క్రితం వచ్చి భారీ విజయాన్ని సాధించింది. తాజాగా దీనికి సీక్వెల్‌ `ఎఫ్‌3` రూపొందుతుంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. కొత్త ఏడాదిని పురస్కరించుకుని శుక్రవారం `ఎఫ్‌3` చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. 

ఇందులో వెంకటేష్‌ పైన, వరుణ్‌ తేజ్‌ కింద డబ్బుని చూసి వాహ్‌ అంటూ ఆనందిస్తున్నట్టుగా ఈ పోస్టర్‌  ఉంది. వెంకటేష్‌, చిత్ర బృందం ఈ పోస్టర్‌ని పంచుకున్నారు. మూడు రెట్లు ఫన్‌ ఉంటుందని వెంకీ తెలిపారు. అయితే ఇది మనీ చుట్టూ సాగుతుందని తెలుస్తుంది. మరోవైపు న్యూ ఇయర్‌ విషెస్‌ తెలిపారు వెంకటేష్‌. సంతోషకరమైన, ప్రశాంతతో కూడి కొత్త ఏడాది ఉండాలని, మన జీవితంలో గొప్ప వ్యక్తులున్నందుకు అభినందనలు తెలియజేసుకుంటున్నా` అని వెంకీ చెప్పారు.