మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు ప్రకటిస్తున్నారు. దర్శకుడు కొరటాల శివతో ఆచార్య మూవీ చేస్తున్న చిరంజీవి ఆ వెంటనే రెండు రీమేక్ చిత్రాలు చేయనున్నారు. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ రీమేక్ చేస్తున్నట్లు చిరంజీవి ఇప్పటికే వెల్లడించడం చేసింది. యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా, ఈ స్క్రిప్ట్ పై ఆయన కొన్నాళ్లుగా వర్క్ చేస్తున్నారు. 

అలాగే చిరు దర్శకుడు మెహర్ రమేష్ తో ఓ మూవీ చేస్తున్నారు. మెహర్ రమేష్ తో చిరంజీవి చేస్తున్నది 2015 తమిళ్ హిట్ మూవీ వేదాళం అని సమాచారం. దర్శకుడు శివ డైరెక్షన్ లో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ మూవీలో అజిత్ నటన అధ్బుతం అని చెప్పాలి. ఈ పాత్ర చేయడం చిరంజీవికి కూడా ఛాలెంజే అన్న మాట వినిపిస్తుంది. 

ఇక ఈ మూవీలో చిరు చెల్లెలి పాత్ర కోసం సాయి పల్లవిని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనిల్ సుంకర ఈ మూవీని నిర్మించనున్నారట. మరి ఆచార్య తరువాత చిరు మొదలుపెట్టనున్న మూవీ వేదాళం రేమేకా లేక లూసిఫర్ నా అనేది తెలియాల్సి ఉంది. మరో వైపు చిరు ఆచార్య షూటింగ్ పూర్తి చేయాల్సివుంది. 40 శాతానికి పైగా ఆచార్య షూటింగ్ పూర్తికాగా వచ్చే ఏడాది మొదలుకానుంది.