స్టార్ హీరోలంతా తాము ఇక్కడ సినీ పరిశ్రమలో సంపాదించిన డబ్బుని మళ్లీ ఇక్కడే నిర్మాతగా పెట్టుబడి పెడుతున్నారు. ఓ రూపాయి ఆర్జించవచ్చు. అలాగే తమ సినిమాలకు తాము ఫైనాన్సియల్ పార్టనర్ గా ఉండటంతో కొంత స్వేచ్చ ఉంటుంది. అదే విధంగా నిర్మాతకి భరోసా ఉంటుంది. హీరోకు తను కష్టపడి చేసిన సినిమాపై, తన ఇమేజ్ పై మరికొంత డబ్బు చేసుకునేందుకు అవకాసం ఉంటుంది. అయితే ఇవన్నీ స్టార్ హీరోలకు మాత్రమే చేయగలరు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నవాళ్లు, ఎదురు దెబ్బలు తింటున్నవాళ్ళు చేయాలంటే కష్టం. కానీ వరుణ్ తేజ మాత్రం ధైర్యంగా నిర్మాతగా మారి రంగంలోకి దూకి, సొంత డబ్బుని పెట్టుబడిగా పెడుతున్నాడట. మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే రామ్ చరణ్ నిర్మాణ రంగంలో ఉన్నారు. తన సోదరుడు ప్రేరణతో ఇలా చేస్తున్నాడంటున్నారు.

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు... వరణ్ తేజ ఇప్పుడు చేస్తున్న సినిమాకు తనే సొంతంగా డబ్బు పెట్టుబడి పెడుతున్నాడు.  కిర‌ణ్ కొర్ర‌పాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఈ ధైర్యం చేస్తున్నాడట. స్క్రిప్టు బాగా నచ్చటంతో తనే పెట్టుబడి పెట్టాలని ఈ నిర్ణయానికి వచ్చాడట.అయితే ఆ విషయం సీక్రెట్ గా ఉంచుతున్నారు. సిద్దు ముద్ద అనే వ్యక్తి పేరు నిర్మాతగా పడుతుంది. సిద్దు...వరుణ్ తేజ కు దగ్గర బంధువు. దాంతో అతన్ని అడ్డం పెట్టి వరుణ్ తేజ సీక్రెట్ గా ఈ వ్యవహారం నడిపిస్తున్నారన్నమాట. అంతేకాదు రాజ్ తరణ్ తో కూడా ఓ సినిమాని వరుణ్ తేజ డబ్బులతో నిర్మిస్తున్నారట.

 అలాగే ఈ సినిమా కోసం అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ దగ్గర శిక్షణ తీసుకున్నాడు వరుణ్ తేజ్. ఆ సినిమా మొదటి షెడ్యూల్ ఇటీవలే విశాఖపట్నంలో పూర్తి అయ్యింది. రెండో షెడ్యూల్ మొదలయ్యే లోపు కరోనా వైరస్ వల్ల షూటింగ్ ఆగిపోయింది.  ఇది ఇలా ఉండగా వరుణ్ తేజ్ బాక్సింగ్ సినిమాను జులై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.