మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. రామ్ చరణ్ కి కరోనా సోకిందని వార్తలు వచ్చిన గంటల వ్యవధిలోనే వరుణ్ సైతం కరోనా బారినపడడం అందరినీ ఆందోళనకు గురిచేసింది. మెగా హీరోలందరూ కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. దీనితో మెగా హీరోలలో చాలా మందికి కరోనా సోకే అవకాశం కలదని పరిశ్రమతో పాటు ఫ్యాన్స్ ఆందోళన చెందారు. 

అదృష్టవశాత్తు చరణ్, వరుణ్ మాత్రమే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. ఇక ఈ ఇద్దరు హీరోలు సెల్ఫ్ క్వారంటైన్ అయ్యారు. కాగా వరుణ్ సోషల్ మీడియాలో తన క్వారంటైన్ కి సంబంధించిన ఫోటో పంచుకున్నారు. క్వారంటైన్ మొదలై ఏడు రోజులని ఆయన ఫ్యాన్స్ కి తెలియజేశాడు. అలాగే ఆయన లేటెస్ట్ లుక్ ని ఇంస్టాగ్రామ్ లో పంచుకోవడం జరిగింది. 

ప్రస్తుతం వరుణ్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కొంత చిత్రీకరణ జరుపుకుంది. ఈ చిత్రం కోసం వరుణ్ ప్రొఫెషనల్ బాక్సర్స్ వద్ద శిక్షణ తీసుకోవడం జరిగింది. దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సిద్దు ముద్దా, అల్లు వెంకట్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.