Asianet News TeluguAsianet News Telugu

అయ్యో... వరుణ్ తేజ్ కష్టం మొత్తం వృధాయేనా?

 ఫిధా సినిమాతో అతని దశ తిరిగింది. అతనికంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత వచ్చిన తొలిప్రేమ ఆ ఫాలోయింగ్ ని రెట్టింపు చేసింది. ఈ నేపధ్యంలో తన ప్రతీ సినిమాని ఓ పరీక్షలా భావించి కష్టపడుతున్నాడు. అయితే ఇప్పుడు అతని కష్టం వృధా అయ్యిపోయింది మాటలు ఇండస్ట్రీ లో వినపడుతున్నాయి. 

Varun Tej Hard Work Goes Waste?
Author
Hyderabad, First Published May 1, 2020, 11:39 AM IST


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ఇక గత ఏడాది ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ చిత్రాలతో మంచి హిట్టు అందుకున్నాడు. తన సత్తాను ప్రతీ సినిమాకూ చూపిస్తూ స్టార్ డమ్ ని సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఫిధా సినిమాతో అతని దశ తిరిగింది. అతనికంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత వచ్చిన తొలిప్రేమ ఆ ఫాలోయింగ్ ని రెట్టింపు చేసింది. ఈ నేపధ్యంలో తన ప్రతీ సినిమాని ఓ పరీక్షలా భావించి కష్టపడుతున్నాడు. అయితే ఇప్పుడు అతని కష్టం వృధా అయ్యిపోయింది మాటలు ఇండస్ట్రీ లో వినపడుతున్నాయి. అందుకు కారణం ఏమిటో చూద్దాం...

వివరాల్లోకి వెళితే.. వరుణ్ తేజ్ కెరీర్ ప్రస్తుతం సాఫీగా సాగిపోతోంది. ఈ హీరో నటించిన రీసెంట్ 2 సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి. అదే ఊపులో మరో సినిమా చేసేయకుండా వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో భిన్నమైన సినిమాను ఎంచుకున్నాడు. అలాగే ఏదో చేసేసాం అంటే చేసేసాం అన్నట్లుగా ఉండకూడదని ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ భాక్సర్ నీరజ్‌ గోయత్‌ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. పంచింగ్ బ్యాగ్ పై చెమటలు చిందేలా ప్రాక్టీస్ చేస్తూ.. కండలు తిరిగిన శరీరంతో బాక్సర్ గెటప్ లో రెడీ అయ్యాడు.ఆ తర్వాత ఓ నెల పాటు వైజాగ్ షెడ్యూల్ లో పాల్గొన్నాడు. కానీ ఈలోగా లాక్ డౌన్ రావటంతో ..ఇంటిపట్టునే ఉండిపోయాడు. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని పరిస్దితి. 
 
 రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలవుకావాల్సి ఉంది.  ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్  మొత్తాన్ని కంప్లీట్ చేసేస్తారని వినికిడి. అయితే ఇప్పుడున్న పరిస్దితుల్లో చాలా అనిశ్చితి నెలకొని ఉంది. దాంతో దర్శక,నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఈక్రమంలో కష్టపడి ట్రైనింగ్ తీసుకున్నదంతా వృధా అవుతుందని అంటున్నారు. మరో ప్రక్క జులై 30కి ఎలాగైనా చిత్రాన్ని విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్న  నిర్మాతలు అది జరిగే పనికాదని అర్దం చేసుకున్నారు.

అల్లు వెంకటేష్,  సిద్దు ముద్ద ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. థమన్ సంగీత దర్శకుడు.   ఈ చిత్రంలో ఒక కీలక పాత్రకు కన్నడ స్టార్ హీరో  ఉపేంద్రను అనుకుంటున్నారట. లెంగ్త్ తక్కువైనా సరే ఆయన పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన్ను టీమ్ సంప్రదించిందట. ఒకవేళ ఉపేంద్ర చేస్తే కనుక ఈ చిత్రానికి వెయిట్ పెరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కు పోటీ పాత్రలో నవీన్ చంద్ర నటిస్తున్నాడు. అలాగే నదియా ఒక కీలక పాత్రలో కనిపించనుంది

Follow Us:
Download App:
  • android
  • ios