Asianet News TeluguAsianet News Telugu

చనిపోయిన అభిమాని ఫ్యామిలీకి వరుణ్‌ తేజ్‌ ఆర్థిక సాయం..

హీరో వరుణ్‌ తేజ్‌ మరోసారి తన పెద్ద మనసుని చాటుకున్నారు. అభిమాని కుటుంబానికి అండగా నిలిచారు. వారి ఇబ్బందులను తెలుసుకుని తన వంతు సహాయాన్ని అందజేశారు.

varun tej extended his support for fan family who demised recent  arj
Author
Hyderabad, First Published Jul 18, 2021, 5:16 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ ఆపదలో ఉన్న వారికి తన వంతు సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తన సేవాని మరింత పెంచారు. అభిమాని కుటుంబానికి అండగా నిలిచారు. ఇటీవల చనిపోయిన తన అభిమాని కుటుంబాన్ని వరుణ్‌ తేజ్‌ ఆదుకున్నారు‌. కరీంనగర్‌కి చెందిన శేఖర్‌ అనే అభిమాని ఇటీవల కన్నుమూశారు. వారి ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న వరుణ్‌ తేజ్‌ వారికి తన వంతుసహాయాన్ని అందించారు. 

రెండు లక్షల రూపాయలు అర్థికసాయం చేశారు. తాజాగా ఆదివారం శేఖర్‌ కుటుంబానికి వరుణ్‌ తేజ్‌ టీమ్‌ రెండు లక్షల చెక్‌ని అందజేశారు. ఈ సందర్భంగా శేఖర్‌ ఫ్యామిలీ వరుణ్‌ తేజ్‌కి ధన్యవాదాలు తెలియజేశారు. వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం `ఎఫ్‌3`, `గని` చిత్రాల్లో నటిస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రెండేళ్ల క్రితం విడుదలై బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన `ఎఫ్‌2`కి సీక్వెల్‌గా `ఎఫ్‌3` తెరకెక్కిస్తున్నారు. మరోవైపు `గని` చిత్రంలో బాక్సర్‌గా నటిస్తున్నారు వరుణ్‌. 
 

Follow Us:
Download App:
  • android
  • ios