టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే ప్రభాస్ ఆ తరువాత రానాల పేర్లు గుర్తొస్తాయి. కుర్ర హీరోలను ఎవరినైనా పెళ్లెప్పుడు చేసుకుంటారని అడిగితే ఇంకా ప్రభాస్, రానాలే చేసుకోలేదు.. మాకింకా టైమ్ ఉందంటూ తప్పించుకుంటున్నారు.

తాజాగా మెగాహీరో వరుణ్ తేజ్ కూడా ఇదే మాట చెప్పి పెళ్లి టాపిక్ నుండి తప్పించుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ నటించిన 'ఎఫ్2' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది.

ఈ క్రమంలో వరుణ్ తేజ్ ని ఓ ఇంటర్వ్యూలో పెళ్లెప్పుడు చేసుకుంటారని ప్రశ్నించగా.. దానికి సమాధానంగా.. ''నా పెళ్లికి తొందరేముంది. ఇంకా చాలా మంది సీనియర్ హీరోలు ఉన్నారు కదా.. రానా బెస్ట్ ఎగ్జాంపుల్. రానా కోసం వెయిటింగ్. తనకు పెళ్లైన వెంటనే నేను కూడా చేసుకుంటా'' అంటూ చెప్పుకొచ్చాడు.

'ఎఫ్2' సినిమా చేసిన తరువాత తన మైండ్ సెట్ మారిందని, మూడేళ్ల వరకు పెళ్లి చేసుకోకూడదని అనుకున్న తనకు ఈ సినిమా చేసిన తరువాత పెళ్లి చేసుకోవాలనే పొజిషన్ కి వచ్చానని చెబుతున్నాడు. అయితే ఎప్పుడనే విషయం తన చేతిలో లేదని క్లారిటీ ఇచ్చాడు.