తేరి చిత్రం ఆరేళ్ళ క్రితమే పోలీసోడుగా దిల్ రాజు  డబ్బింగ్ చేసి వదిలారు. తెలుగులో వర్కవుట్ కాలేదు.  ఇప్పుడు  దాన్నే బోలెడన్ని మార్పులతో ఉస్తాద్ భగత్ సింగ్ గా తీస్తున్నారు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సంగతి తెలిసిందే . డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాపై ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. అవి ప్రక్కన పెడితే ఇప్పుడు ఇదే కథతో హిందీలో ఓ చిత్రం రూపొందుతోంది అని సమాచారం.అదేంటి ఇక్కడ రిలీజ్ అయ్యి...హిట్ అయ్యాక కదా..అక్కడ రీమేక్ అయ్యేది అంటే... 

ఈ సినిమా విజయ్ హీరోగా వచ్చిన తేరీ కు రీమేక్ అనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అఫీషియల్ గా ఎక్కడా ప్రకటన లేదు కానీ తేరీకు భారి మార్పులు చేసి ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ రూపొందింస్తున్నారని అంతటా వినిపిస్తుంది. వాస్తవానికి తేరి చిత్రం ఆరేళ్ళ క్రితమే పోలీసోడుగా దిల్ రాజు డబ్బింగ్ చేసి వదిలారు. తెలుగులో వర్కవుట్ కాలేదు. ఇప్పుడు దాన్నే బోలెడన్ని మార్పులతో ఉస్తాద్ భగత్ సింగ్ గా తీస్తున్నారు. దబాంగ్ ని గబ్బర్ సింగ్ గా ఎలా అయితే మార్పులు చేసి బ్లాక్ బస్టర్ ఇచ్చారో అదే విధంగా... ఉస్తాద్ ని అంతకు మించిన స్థాయిలో అందిస్తాడనే నమ్మకం పవన్ ఫ్యాన్స్ లో ఉంది. అది ఖచ్చితంగా జరుగుతుంది కూడా. అది ప్రక్కన పెట్టి అసలు విషయంలోకి వస్తే...

Scroll to load tweet…

ఇప్పుడు అదే తేరిని చిత్రాన్ని హిందీలో వరుణ్ ధావన్ హీరోగా చేయబోతున్నారు. తమిళంలో చేసిన డైరక్టర్ అట్లీ నిర్మాతగా మారి మరో తమిళ డైరెక్టర్ కలీస్ తో ఈ సినిమా ప్లాన్ చేసారట. అలాగే తేరీకు కొన్ని హిందీ కోసం మార్పులు చేయబోతున్నారట. అంతేకాదు ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలయ్యే సమయానికి హిందీలో రిలీజ్ అయ్యేలా అట్లీ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే పవన్ సినిమా కూడా స్పీడు అందుకుంది. 

Scroll to load tweet…

ఆ మధ్యన బ్రేక్ వచ్చిన ఈ చిత్రం తాజా షెడ్యూల్ జులై 2 ఆదివారం రోజున మొదలైంది. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నుండి తాజాగా రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ కు పవన్ ఫ్యాన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోస్ ను ఆడియన్స్ తో పంచుకున్నారు దర్శకుడు హరీష్ శంకర్. ఈ ఫొటోస్ కు "కొన్ని బంధాలు మారవు" అనే క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటీస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.భగత్ సింగ్ గా పవన్ లుక్ కూడా నెక్స్ట్ లెవల్లో ఉంది. ఈ చిన్న గ్లింప్స్ తో సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి.