సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వివాదస్పద అడల్ట్ వెబ్ సిరీస్‌ గాడ్స్ సెక్స్ ట్రూత్ (జీఎస్టీ) శుక్రవారమే ఆన్‌లైన్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. పోర్న్ మూవీ అంటూ విమర్శలు వచ్చినా.. మహిళా సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేసినా.. వర్మ మాత్రం వెనక్కు తగ్గలేదు. పోర్న్‌స్టార్ మియా మాల్కోవా అందాలను వీక్షించేందుకు నెటిజన్లు ఎగబడటంతో వెబ్‌సైట్‌కు ఊహించని విధంగా ట్రాఫిక్ వచ్చింది. దీంతో వెబ్‌సైట్ స్తంభించింది.

 

‘జీఎస్టీ’ ఆదరణకు అవాక్కయిన నిర్మాతలు వెంటనే వెబ్‌సైట్‌‌ను అప్‌గ్రేడ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. నెటిజన్లు నిరాశ చెందొద్దని వర్మ ట్వీట్ చేశాడు. మరి కొద్ది గంటల్లో వీడియో అందుబాటులో ఉంటుందని చెప్పాడు. జీఎస్‌టీని జనవరి 27న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. చెప్పినట్లే సరిగ్గా శనివారం ఉదయం 9 గంటలకు ఈ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో ఉంచినట్లు వర్మ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వెల్లడించాడు.

అంతకు ముందు జీఎస్‌టీని ఉద్దేశించి ట్వీట్ చేసిన వర్మ.. దీపికా పదుకొనే కంటే ఎక్కువ మంది మియా మాల్కోవానే చూసేందుకు ఎగబడుతున్నారంటూ గూగుల్ ట్రెండ్స్‌ను బయటపెట్టాడు. ఇక వర్మ రూపొందించిన విడియోను ఈ క్రింద ఇమేజ్ లో ఇచ్చిన లింక్ లో చూడొచ్చు.