ఆ మధ్యన ఒక ఊపు ఊపిన క్యాస్టింగ్ కౌచ్ కంప్లైంట్స్ ఈ మధ్యన కాస్త తగ్గాయనే చెప్పాలి. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్స్ తమకు ఎదురైన చేదు సంఘటనలు గురించి నోరు విప్పి చెప్పుకున్నారు. ఆ బాధాకరమైన అనుభవాలను మర్చిపోతున్న సమయంలో మరో హీరోయిన్ తనకు ఎదురైన  క్యాస్టింగ్ కౌచ్ ఘటనల గురించి ఓ ఇంటర్వూలో చెప్పింది. ఆమె మరెవరో కాదు..వాణి భోజన్. వాణి బోజన్ గుర్తు వచ్చిందా...  విజయ్ దేవరకొండ నిర్మాతగా.. తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ‘మీకు మాత్రమే చెబుతా’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. 

వాణీ భోజన్  రీసెంట్ గా ఓ ప్రొడ్యూసర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘గతంలో నేను సినిమాలో ఆఫర్ కోసం అని ఓ ప్రొడ్యూసర్‌ను కలిశాను. అవకాశం ఇవ్వాలంటే నన్ను బెడ్రూమ్‌కు రమ్మన్నాడు. నేను కూడా ఇలా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాను’ అని వాణీ చెప్పుకొచ్చింది. తన షూటింగ్, డేట్స్ వంటి వ్యవహారాలు తన మేనేజర్ చూసుకునే వాడని.. మీ మేడమ్‌కి అవకాశమివ్వాలంటే అడ్జస్ట్ అవ్వాలని కొందరు.. పడగ్గదికొస్తదా చెప్పు.. ఇప్పుడే సినిమా ఫిక్స్ చేద్దాం అని కొందరు తన మేనేజర్‌తో చెప్పినట్టు తనకు చెప్పాడని వాణి భోజన్ తెలిపింది. 

అయితే ఇంతకీ ఆ ప్రొడ్యూసర్ ఎవరు..? మిమ్మల్ని డైరక్ట్ గా  సెక్సువల్ ఆఫర్ అడిగిన ప్రొడ్యూసర్ పేరు మాత్రం లీకు చేయడానికి ఆ భామ సాహసించలేదు. అంతేకాదు.. చిన్నపాటి క్లూ కూడా ఇవ్వలేదు.

వాణీ భోజన్ అంతకుమునుపు తమిళ సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే మీకు మాత్రమే చెబుతా అని చెప్పిన ఈ భామ ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో అడ్రస్ లేకుండా పోయింది. తాజాగా ఇలా ప్రొడ్యూసర్‌పై కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.