ఈ మధ్యకాలంలో టీవి ఆర్టిస్ట్ లు తరుచుగా ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ మీడియాకు ఎక్కుతున్నారు. తాజాగా  పాపులర్ తెలుగు టీవీ సీరియల్స్ లో నటిస్తున్న నటుడు రాజేష్ దత్త వివాదంలో ఇరుక్కున్నారు. భార్య ఉండగానే ఇతర అమ్మాయిలతో ఇల్లీగల్ అఫైర్స్‌ పెట్టుకున్నాడని ఆరోపిస్తూ..రాజేష్‌ భార్య, ఆమె తల్లిదండ్రులను పోలీసులను ఆశ్రయించారు. వధినమ్మ,చంద్రలేఖ సీరియల్స్‌లో లీడ్ రోల్స్ చేస్తున్న రాజేష్ గతంలో కర్తవ్యం, సుందరకాండ, మొగలిరేకులు, చక్రవాకం, రాధాకళ్యాణం, యువ, అలాగే ఈటివిలో తూరుపు వెల్లే రైలు, చెంద్రలేఖ ఇలా సుమారు 28 సీరియల్స్‌లో చేశాడు.

సీరియల్స్ లో శ్రీరామ చంద్రుడులా కనిపించే రాజేష్..., నిజ జీవితంలో మాత్రం తనను మోసం చేశాడంటోంది. తనకు పెళ్ళికాలేదని చెప్తూ ఇతర అమ్మాయిలతో ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నాడని ఆరోపిస్తోంది. రాజేష్‌కు తనకు 2015,జూన్‌ 6న వివాహం జరిగిందని అరుణ అలియాస్‌ సాధన చెబుతోంది. తమ పెళ్లి విజయవాడలో తమ తల్లిదండ్రుల ఆధ్వర్యంలో గ్రాండ్‌గా జరిగిందని చెప్పింది. రూ.15లక్షల నగదు, 10 తులాల బంగారం కట్నంగా ఇచ్చినట్లు సాధన తల్లిదండ్రులు చెబుతున్నారు. 

ఆ తర్వాత 3 నెలలు భార్య సాధనతో నగరంలోని గాజులరామారం లోని రాజేష్ ఇంట్లోనే హాయిగా వీరి సంసారం సాగిందని చెప్పింది. ఆ తర్వాత తనను చెన్నై తీసుకెళ్లి… అక్కడే కట్టుబట్టలతో వదిలేసినట్లుగా బాధితురాలు వాపోయింది. రాజేష్ కు ఇతర అమ్మాయిలతో ఇల్లీగల్ అఫైర్స్ ఉందని అంటోంది. ఇదేంటని నిలదీసినందుకు తరుచూ గొడవపడేవాడని చెప్పింది.

 “నాఇష్టం, నేను ఎవరితోనైన తిరుగుతాను..అంటూ తెగేసి చెప్పేవాడని, అమ్మాయిలని ఇంటికి కూడా తీసుకువచ్చేవాడని చెప్పింది. తనను నిలదీసినందుకు చివరకు కట్టుబట్టలతో ఇంట్లోనుండి గెంటివేశాడని రాజేష్‌ భార్య సాధన ఆందోళన వ్యక్తం చేస్తోంది. సాధన ఆమె తల్లిదండ్రులు కలిసి జగద్గిరి గుట్ట పోలీసులను ఆశ్రయించి రాజేష్‌పై ఫిర్యాదు చేశారు. రాజేష్ ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. తనకు న్యాయం కావాలని సాధన డిమాండ్‌ చేస్తోంది.