నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’ ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా మేకర్స్ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ అందించారు.
టాలీవుడ్ స్టార్ హీరో.. నేచురల్ స్టార్ నాని (Natural star Nani) శ్యామ్ సింగరాయ్ చిత్రం విజయవంతం తర్వాత వరుస సినిమాల్లో.. విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో నాని నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki). ఈ చిత్రంలో సుందర ప్రసాద్ గా బ్రహ్మణ వేషధారణలో అలరించనున్నాడు నాని. ఇక హీరోయిన్ నజ్రియా Fahad (Nazriya Fahad) నాని సరసన ఆడిపాడనుంది. ఈ చిత్ర షూటింగ్ పార్ట్ పూర్తైయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
తాజాగా Ante Sundaraniki నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్ అందించారు. గతంలో ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లిమ్స్, టీజర్ తో ఆకట్టకున్న చిత్ర యూనిట్ ప్రస్తుతం మ్యూజిక్ ట్రాక్ తో ఆడియెన్స్ లో సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. ఇటీవల ఫస్ట్ సింగిల్ పేరిట ‘పంచె కట్టు’ Panche Kattu సాంగ్ ను రిలీజ్ చేశారు. తాజాగా ‘రీసాట్’ పేరుతో అప్డేట్ అందించారు. రేపు ఉదయం 11:07 నిమిషాలకు ఈ అప్డేట్ ను రివీల్ చేయనున్నారు. దీంతో నాని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.
అంటే సుందరానికీలో.. నాని సుందర ప్రసాద్ అనే పాత్రలో నటిస్తున్నాడు. నాని సరసన హీరోయిన్ నజ్రియా ఫహద్ (Nazriya Fahad) ఆడిపాడనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్నాడు. కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం నాని దసరా మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో నాని సరసన హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు.
