Asianet News TeluguAsianet News Telugu

ఎల‌క్ట్రిక్ కారు కొన్న ఉపాస‌న‌, లగ్జరీ కారు కోసం ఎన్ని కోట్లు పెట్టిందో తెలుసా..?

టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాసన కొణిదెల ఓ కొత్త కారును కొన్నారు. కోట్లు విలవ చేసే ఆడి కంపెనీకి చెందిన ఎల‌క్ట్రిక్ కారును ఆమె సొంతం చేసుకున్నారు. 

Upasana Konidela Buys Luxurious Audi E Tron Electric Car
Author
Hyderabad, First Published Jul 30, 2022, 8:15 PM IST

టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాసన కొణిదెల ఓ కొత్త కారును కొన్నారు. కోట్లు విలవ చేసే ఆడి కంపెనీకి చెందిన ఎల‌క్ట్రిక్ కారును ఆమె సొంతం చేసుకున్నారు. 

సెలబ్రెటీలు ఎప్పుడూ ఏదో ఒక కాస్ట్లీ వస్తువులూ కొంటూనే ఉంటారు. కోట్లు విలువ చేసే కార్లు, వాచ్లు కొంటూ.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇక ముఖ్యంగా  టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాసన కొణిదెల ఎప్పుడూ కొత్త కార్లు కొంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. ఇక ఈసారి కూడా ఓ సరికొత్త కారుతో ఆమె హడావిడి చేశారు. ఈ కారులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 

 

ఉపాసన కొణిదెల ఓ కొత్త కారును కొన్నారు. కోట్లు విలవ చేసే ఆడి కంపెనీకి చెందిన ఎల‌క్ట్రిక్ కారు  ఆడి ఇ-ట్రాన్‌లో ఆమె విహ‌రిస్తున్నారు. ఈ కారు విలువ దాదాపు 1.66 కోట్ల పైమాటే. ఈ కారులో తాను ఎంత సౌక‌ర్య‌వంతంగా ప్ర‌యాణిస్తున్నాన‌న్న విష‌యాన్ని ఆమె త‌న కొత్త కారులో కూర్చుని మ‌రీ వివ‌రించారు. ఈ వీడియో నెట్టింట్ట వైరల్ అవుతుంది. 

ప్ర‌పంచంలో ప్ర‌తిదీ అప్‌గ్రేడ్ అవుతోంద‌ని తెలిపిన ఉపాస‌న‌... అందుక‌నుగుణంగా తాను కూడా అప్‌గ్రేడ్ అయ్యాన‌ని తెలిపారు. అందులో భాగంగానే ఆడి ఇ-ట్రాన్‌ను కొనుగోలు చేశాన‌ని తెలిపారు. ఈ కారులో తాను ఎంతో సౌక‌ర్య‌వంతంగా ప్ర‌యాణించ‌గ‌లుగుతున్నాన‌ని, త‌న అన్ని అవ‌స‌రాల‌కు ఈ కారు అనువుగా ఉంద‌ని కూడా ఆమె తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios