నా పేరు సూర్య ఆల్ టైమ్ హిట్ అంట ఆ క్రిటిక్ చెప్పేశాడు

Umair sandhu Naa Peru Surya Na Illu India  review
Highlights

నా పేరు సూర్య ఆల్ టైమ్ హిట్ అంట ఆ క్రిటిక్ చెప్పేశాడు

 సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు ఫస్ట్ రివ్యూ. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పెద్ద సినిమాలన్నింటినీ విడుదలకు ముందే దుబాయ్‌లో చూసేసి సంధు రివ్యూలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ‘నా పేరు సూర్య’ సినిమాను కూడా ఆయన చూసేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.‘ఓవర్సీస్ సెన్సార్ బోర్డు వద్ద నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా చూశాను. చాలా బాగా తెరకెక్కించారు. సింప్లీ మైండ్‌బ్లోయింగ్. అల్లు అర్జున్ నటన తారాస్థాయిలో ఉంది. ‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’ తరహాలో తెలుగులో మరో బ్లాక్‌బస్టర్ వస్తోంది’ అని ఉమైర్ సంధు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

సాధారణంగా ఉమైర్ సంధు అన్ని సినిమాలకు రేటింగ్ పాయింట్స్ 3 తగ్గకుండా ఇస్తుంటారు. ఆయన అదరహో అన్న చాలా సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. అయితే ‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’ సినిమాల విషయంలో ఆయన చెప్పిందే నిజమైంది. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్లని విడుదలకు ఒకరోజు ముందే సంధు రివ్యూ ఇచ్చారు. ఆయన అన్నట్టుగానే ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించాయి. ఇప్పుడు ‘నా పేరు సూర్య’ విషయంలో కూడా అదే నిజమవుతుందేమో చూడాలి.


 

loader