Asianet News TeluguAsianet News Telugu

చివరి నిమిషంలో వాయిదా.. ఓటీటీ రిలీజ్‌లోనూ ఇబ్బందులు!

C/O కంచెర పాలెం సినిమా తరువాత ఆయన చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాను బాహుబలి లాంటి సినిమా చేసిన ఆర్కా మీడియా సంస్థ నిర్మాతగా వ్యవహరిస్తోంది. కేరాఫ్ కంచెర పాలెం సినిమా మాదిరిగానే ఈ సినిమాలో కూడా నిజజీవిత పాత్రలతోనే దర్శకుడు సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో టైటిల్ రోల్ లో హీరో సత్యదేవ్ నటిస్తున్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన చిన్న వీడియోలో ఆయనతో పాటు సీనియర్ నటులు పెద్ద నరేష్ గారు కూడా ఉన్నారు.

Uma Maheswara Ugra Roopasya to be postponed?
Author
Hyderabad, First Published Jul 15, 2020, 10:02 AM IST

ఈ మ‌ధ్య‌కాలంలో మంచి బ‌జ్ తెచ్చుకున్న చిత్రం 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'. 'బాహుబలి'‌ నిర్మాతలు‌ శోభూ యార్లగడ్డ, ప్ర‌సాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. సత్యదేవ్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని ‘కేరాఫ్‌ కంచరపాలెం’ ఫేం వెంకటేష్‌ మహా తెర‌కెక్కించారు. ఈ మూవీని నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్ ఫ్లిక్స్ లో ఈ రోజు రిలీజ్ ప్లాన్ చేసారు. కానీ బయిటకు రాని కారణాలతో వాయిదా పడింది. ఈ రోజు ఈ చిత్రం ఓటీటిలో రిలీజ్ కాలేదు. కొత్త రిలీజ్ డేట్ ఇంకా తెలియరాలేదు.

ఇక ఈ చిత్రంలో సత్యదేవ్  పేరు ఉమా మహేశ్వర రావు. అరకు వ్యాలీలో “కోమలి ఫోటో స్టూడియో” ఓనర్. స్వతహాగా చాల మంచివాడు. కానీ ఒకరోజు అనుకోకుండా తన తప్పు లేకపోయినా ఉమా మహేశ్వర రావు ఇంకొకరి చేతిలో దెబ్బలు తింటాడు. ఆ గొడవ తరువాత తనని కొట్టినవాడిని తిరిగి కొట్టేంత వరకూ చెప్పులు వేసుకోనని శపథం చేస్తాడు. ఆ విశేషాలు తెలియాలంటే “ఉమా మహేశ్వర – ఉగ్రరూపస్య” సినిమా చూడాల్సిందే.

C/O కంచెర పాలెం సినిమా తరువాత ఆయన చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాను బాహుబలి లాంటి సినిమా చేసిన ఆర్కా మీడియా సంస్థ నిర్మాతగా వ్యవహరిస్తోంది. కేరాఫ్ కంచెర పాలెం సినిమా మాదిరిగానే ఈ సినిమాలో కూడా నిజజీవిత పాత్రలతోనే దర్శకుడు సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో టైటిల్ రోల్ లో హీరో సత్యదేవ్ నటిస్తున్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన చిన్న వీడియోలో ఆయనతో పాటు సీనియర్ నటులు పెద్ద నరేష్ గారు కూడా ఉన్నారు.

కేరాఫ్ కంచెర పాలెం లో నటించి ఆ సినిమాను నిర్మించిన విజయ ప్రవీణా పరుచూరి ఈ సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత మలయాళం లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించిన బిజిబల్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ వీడియో లో ఆయన మ్యూజిక్ కి గొప్ప స్పందన వస్తోంది.

స‌త్య‌దేవ్ కంచ‌ర‌న, న‌రేష్‌, సుహాస్‌, జ‌బ‌ర్‌ద‌స్త్ రాంప్ర‌సాద్‌, కరుణాకరణ్, టి.ఎన్‌.ఆర్‌, ర‌వీంద్ర విజ‌య్‌, కె.రాఘ‌వ‌న్ త‌దిత‌రులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: బిజ్‌బ‌ల్‌, కెమెరా: అప్పు ప్ర‌భాక‌ర్‌, ద‌ర్శ‌క‌త్వం: వెంక‌టేశ్ మ‌హ‌, నిర్మాత‌లు: శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్రసాద్ దేవినేని(ఆర్కా మీడియా వ‌ర్క్స్‌), విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి(మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్‌).

Follow Us:
Download App:
  • android
  • ios