Asianet News TeluguAsianet News Telugu

అయ్యో... ఈ సినిమాని కూడా థియోటర్ లో చూడలేమా?

మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన హిట్ చిత్రం `మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌` చిత్రాన్ని వెంకటేశ్ మ‌హ తెలుగులో రీమేక్ చేశాడు.  ఈ చిత్రానికి తెలుగులో `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూపాశ్య‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేసి టీజర్ వీడియో వదలితే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో ఏప్రిల్ 2020లో విడుదల ప్లాన్ చేసారు. కానీ కరోనా ప్రభావంతో థియోటర్స్ ఇప్పుడిప్పుడే తెరిచే పరిస్దితి కనపడటం లేదు.

Uma Maheswara Ugra Roopasya gets U, opts digital release!
Author
Hyderabad, First Published Jun 6, 2020, 10:37 AM IST

'కేరాఫ్ కంచరపాలెం' తో పరిచయం అయిన దర్శకుడు వెంకటేష్ మహా రెండో సినిమా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. తన రెండో సినిమాకే  రీమేక్ సబ్జెక్ట్ ని ఎన్నుకున్నాడు. మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన హిట్ చిత్రం `మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌` చిత్రాన్ని వెంకటేశ్ మ‌హ తెలుగులో రీమేక్ చేశాడు.  ఈ చిత్రానికి తెలుగులో `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూపాశ్య‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేసి టీజర్ వీడియో వదలితే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో ఏప్రిల్ 2020లో విడుదల ప్లాన్ చేసారు. కానీ కరోనా ప్రభావంతో థియోటర్స్ ఇప్పుడిప్పుడే తెరిచే పరిస్దితి కనపడటం లేదు. దాంతో ఈ సినిమాని సైతం డిజిటల్ రిలీజ్ కు ముస్తాబు చేస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఈ నేపధ్యంలో సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసారు. యు సర్టిఫికేట్ ఈ సినిమాకు లభించింది.

ఇక `మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌` ... గత పదేళ్లకాలంలో వచ్చిన గొప్ప మలయాళ చిత్రాల్లో ఒకటి. ఆర్కా మీడియా వ‌ర్క్స్,  మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై  శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మాత‌లుగా  తీసిన ఈ సినిమాలో సత్యదేవ్ ను హీరోగా చేసారు. ఇస్మార్ట్ శంకర్, రాగల 24 గంటల్లో లాంటి సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. జస్ట్ 36 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తిచేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసారు. 

నిర్మాత‌ శోభు యార్ల‌గ‌డ్డ మాట్లాడుతూ – “వెంక‌టేశ్ మ‌హ మ‌న తెలుగు నెటివిటీకి త‌గ్గ‌ట్టు సినిమాను సెన్సిబుల్‌గా తెర‌కెక్కించ‌గ‌ల ద‌ర్శ‌కుడు. మల‌యాళంలో విజ‌య‌వంతమైన `మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్` చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కులు మెచ్చేలా త‌ను తెర‌కెక్కించ‌గ‌ల‌డ‌ని న‌మ్మ‌కంతో సినిమాను స్టార్ట్ చేశాం“ అన్నారు. స‌త్య‌దేవ్ కంచ‌ర‌న, న‌రేష్‌, సుహాస్‌, జ‌బ‌ర్‌ద‌స్త్ రాంప్ర‌సాద్‌, కరుణాకరణ్, టి.ఎన్‌.ఆర్‌, ర‌వీంద్ర విజ‌య్‌, కె.రాఘ‌వ‌న్ త‌దిత‌రులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: బిజ్‌బ‌ల్‌, కెమెరా: అప్పు ప్ర‌భాక‌ర్‌, ద‌ర్శ‌క‌త్వం: వెంక‌టేశ్ మ‌హ‌, నిర్మాత‌లు: శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్రసాద్ దేవినేని(ఆర్కా మీడియా వ‌ర్క్స్‌), విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి(మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్‌).

Follow Us:
Download App:
  • android
  • ios