పవన్ కు మూడేళ్లు జైలు శిక్ష.. నిజమేనా..?

Tv channels case against pawan kalyan
Highlights

పవన్ కు మూడేళ్లు జైలు శిక్ష.. నిజమేనా..?

మీడియాని దూషిస్తూ ఆవేశంలో మార్ఫింగ్ చేసిన ఫోటోలను కూడా ఆయన పోస్ట్ చేయడంతో మీడియావాళ్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేసిన తర్వాత విచారణ చేసిన పోలీసులు ప్రాథమిక అర్హతలు ఉన్నాయని వాటిని బావించి కేసులు తీసుకున్నామని చెప్పారు.మార్ఫింగ్‌ చేసిన వీడియోలను ట్విటర్లో పెట్టి చానల్‌ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు ఐపీసీ 469, 504, 506 సెక్షన్ల కింద శుక్రవారం కేసులు నమోదు చేశారు. టీవి 9 ప్రశారం చేసిన కథనాలు ప్రకారం కనీసం మూడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. శిక్షతో పాటు జరిమాన కూడా ఉంటుందన్నారు.

 

పవన్ ట్వీట్స్ గురించి పూర్తి టెక్నికల్ సమాచారం మీడియా సంఘాలు ఏర్పరుచుకున్నాయి. ఆధారాలను చెరిపే విధంగా ఐపి అ్రడెస్ పోస్ట్ అయిన వివరాలను కూడా సేకరించుకున్నారు. ఐపి అ్రడెస్ పవన్ దే అని నిర్ధారించుకున్న తర్వాత పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. దీనితో పవన్ తప్పించుకోవడం కష్టమని భావిస్తున్నారు. ఏప్పిల్ 28 వ తేదిన తెల్లవారుజామున మొదలు పెట్టి మీడియా సంస్థలపై యాజమానులపై అడ్డదిడ్డంగా ఆరోపణలు చేస్తు పవన్ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. నిజానికి ఆయన వేసిన వీడియో క్లిప్స్ టీవి ఛానెల్స్ లో ప్రచారం చేసినవి కావు. పవన్ ని శ్రీరెడ్డి తిట్టిన తిట్టును ఆడియో వినపించకుండా మ్యూట్ చేసి మరి అన్ని ఛానెల్స్ లో ప్రసారం చేశాయి. ఎప్పుడు నీతులు చెప్పే పవన్ మ్యూట్ చేసిన ఆడియోను పక్కన పెట్టి మార్ఫింగ్ చేయించిన వీడియోని పెట్టారు. గతంలో  పవన్ కళ్యాణ్ టీవి చానెళ్లపై కేసు వేశారు. అలాగే వాటిని బ్యాన్ కూడా చేయాలన్నారు. అందులో టీవి 9 కొసమెరుపు..

loader