బుల్లితెర నటి సుమోనా చక్రవర్తి థాయిలాండ్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. బికినీ ధరించి బీచ్ ఇసుకలో కూర్చొని ఉన్న ఓ ఫోటో సుమోనాకు తంటాలు తెచ్చిపెడుతోంది. ఈ 31 ఏళ్ల బుల్లితెర నటి బికినీ ఫోజు నెటిజన్లకు ఏమాత్రం నచ్చడం లేదు. 

సుమోనా ఇప్పటి వరకు కపిల్ శర్మ షో, ఏక్తాకపూర్ బడే అచ్చే లగ్తె హై లాంటి ప్[పాపులర్ షోలలో పాల్గొంది. సుమోనా ఇటీవల ఇన్స్టాగ్రామ్లో బికినీ స్టిల్ పోస్ట్ చేయగా నెటిజన్లు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. బీచ్ లో ఇసుకపై సుమోనా కూర్చుని ఉండగా చాలా క్లోజ్ లో ఫోటో క్లిక్ మనిపించారు. 

సుమోనా మరో పూనమ్ పాండే అయ్యేందుకు ప్రయత్నిస్తోందా.. షెర్లిన్ చోప్రా లాగా వల్గర్ ఫోటోలు పోస్ట్ చేయకు.. ఇది బాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి.. బట్టలు లేకుండా ఫోజులు ఇస్తే పబ్లిసిటీ బాగా ఉంటుంది. ఇలాంటి ఫోటో షూట్స్ వల్లే కాస్టింగ్ కౌచ్ సంఘటనలు జరుగుతున్నాయి అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

మరికొందరు నెటిజన్లు పేర్కొనలేని పదజాలంతో సుమోనాని తిడుతున్నారు. ఇటీవల పలువురు బాలీవుడ్ తారలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలతో ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నారు. దిశా పటాని లాంటి హీరోయిన్ల హాట్ ఫోజులపై కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Hello Sunday ⭐️💛🌼🌻

A post shared by Sumona Chakravarti (@sumonachakravarti) on Sep 22, 2019 at 3:49am PDT