కరోనా కారణంగా వినోద రంగవ తీవ్రంగా నష్టపోతోంది. ఇప్పటికే షూటింగ్‌ లు ఆగిపోవటంతో పనిలేక సాంకేతిక నిపుణులతో పాటు నటీ నటులు కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. దీనికి తోడు వరుసగా సినీ, టీవీ ప్రముఖులకు కరోనా పాజిటివ్‌ అంటూ వార్తలు వస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. తాజాగా యే రిష్తా క్యా కెహతా హై ఫేం మోహెనా కుమారి సింగ్‌కు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.

ఈ విషయాన్ని మోహెన తన సోషల్ మీడియా పేజ్‌లో వెల్లడించింది. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చినట్టుగా మోహెన తన సోషల్ మీడియా పేజ్‌లో వెల్లడించింది. అంతేకాదు తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా పేజ్‌లో వెల్లడించటంతో పాటు తనకు విషెస్ చెప్పిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తోంది.

మోహెనతో పాటు ఆమె భర్త, అత్త, మరదలుతో పాటు ఫ్యామిలీలోని మరో నలుగురికి అంటే మొత్తం ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే తన పోస్ట్‌లో మోహెన కరోనా పేరును ప్రస్తావించకపోయినా తమ కుటుంబం ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్నట్టుగా వివరించటంతో అంతా వారికి కరోనా సోకిందని కన్‌ఫార్మ్ చేసుకున్నారు.

మోహెన గత ఏడాది ఉత్తరాఖండ్‌ టూరిజం మినిస్టర్ తనయుడు సుయేష్‌ రావత్‌ను వివాహం చేసుకుంది. రాజవంశీయులైన సుయేష్ కుటుంబంలో కరోనా కలకలం రాష్ట్ర ప్రభుత్వంలోనూ కలకలం సృష్టిస్తోంది. తన సుధీర్ఘ పోస్ట్‌లో గత కొద్ది రోజులుగా తమ కుటుంబం ఆరోగ్య పరంగా ఎదుర్కొంటున్న సమస్యలను వివరించింది మోహెన.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🙏🏽

A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on Jun 1, 2020 at 3:16pm PDT