Asianet News TeluguAsianet News Telugu

సీనియర్ నటి వ్యభిచారం...గంటకు లక్ష, ప్లాన్ చేసి పట్టుకున్న పోలీసులు

పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు సమాచారం ప్రకారం..  జూహులోని 5 స్టార్‌ హోటల్‌లో సదరు మోడల్‌ సెక్స్‌ రాకెట్‌ నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

TV actress and model arrested by Mumbai CBI, was doing this dirty business
Author
Mumbai, First Published Aug 22, 2021, 10:35 AM IST

కరోనా దెబ్బకు సినీ ప్రపంచం మొత్తం కూలిపోయినట్లైంది. ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందో, ఎప్పుడు ఆగుతుందో తెలియని సిట్యువేషన్. ఈ క్రమంలో సినిమా షూటింగ్స్ లేక, దాంతో చేతిలో డబ్బు అడక సినీ కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వేర పని చేయటం రానీ వీళ్లు ఖర్చులను అదుపు చేసుకోలేని సిట్యువేషన్ లో ఉంటున్నారు. ముక్యంగా సినీ మోడల్స్, అప్ కమింగ్ హీరోయిన్స్ కష్టాలు అయితే చెప్పక్కర్లేదు. మెయింటనెన్స్ తప్పదు. డబ్బులు రావటం లేదు. దాంతో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. పోలీస్ లకు పట్టుబడుతున్నారు.

రీసెంట్ గా మహారాష్ట్ర ముంబైలోని ఓ స్టార్‌ హోటల్‌లో గుట్టుగా సెక్స్‌ రాకెట్‌ నడుపుతున్న ఓ మహిళను ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన ఆ మహిళను ఇషా ఖాన్‌గా గుర్తించారు పోలీసులు. ఈమె బాలీవుడ్ లో సీనియర్ టాప్ మోడల్, హీరోయిన్ అని తెలుస్తుంది. ముంబై జుహు ఏరియాలోని ఓ ఫైవ్ స్టార్‌ హోటల్‌లో మరికొందరు టాప్ మోడల్స్, అప్ కమింగ్ హీరోయిన్స్, టీవీ ఆర్టిస్టులతో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఈ మహిళను ట్రాప్ చేసి చాకచక్యంగా పట్టుకున్నారు ముంబై పోలీస్ లు.  

ఆమె బాగా డబ్బున్నవాళ్లను టార్గెట్ చేసుకుంటూ గంటకు లక్ష అంటూ వాట్సప్ ద్వారా డీల్ కుదుర్చుకోవడం చేస్తోంది. మొదట్లో ఈమెపై ఆరోపణలు వచ్చినప్పటికీ సరైనా ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు వెయిట్ చేసారు. కానీ పక్కా ఆధారాలు లభించడంతో నటిని అరెస్టు చేసారు. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. జూహులోని 5 స్టార్‌ హోటల్‌లో  మోడల్‌ ఈ సెక్స్‌ రాకెట్‌ నడుపుతున్నట్టు వచ్చిన ఇన్ఫర్మేషన్ తో స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఈ రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు.

అందులో భాగంగా ఇషా ఖాన్‌ కి ఫోన్ చేసి సాధారణ కష్టమర్స్ గా మాట్లాడటం మొదలుపెట్టారు పోలీసులు. తమకు టాప్ మోడల్స్ కావాలని ఫోన్ లో అడిగిన పోలీసులకి.. వారితో గడపాలంటే ఒక్కరికి గంటకు రూ. 2 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేసి వారి ఫోటోలని వాట్సాప్ లో పంపించింది. ప్లాన్ ప్రకారం...డీల్ ఒకే అని చెప్పారు. దాంతో ఆ పోలీసులని కలుసుకోవడానికి జూహులోని ఓ స్టార్‌ హోటల్‌కు రావాల్సిందిగా ఆమె చెప్పింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు హోటల్‌కు వెళ్లిన పోలీసులు సదరు మోడల్‌తో పాటు మరో ఇద్దరు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. 

అయితే వీరిని విచారించిన పోలీసులకి.. కరోనా కష్టాలతో ఉపాధి కోల్పోవటంతోనే వ్యభిచారంలోకి దిగామని చెప్పారు అరెస్ట్ అయిన మోడల్స్. అనంతరం ఈ సెక్స్ రాకెట్‌ నడుపుతున్న ఇషాఖాన్‌పై పోలీసులు సంబంధిత సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి మరో ఇద్దరు అమ్మాయిలను పునరావస కేంద్రాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios