Asianet News TeluguAsianet News Telugu

”టక్ జగదీష్” రాడ్ అంటూ ట్రోల్స్.! స్పందిచిన డైరక్టర్

కుటుంబం, కుటుంబ సభ్యుల విలువను చెప్పడానికి నాని, జగపతిబాబు, శివనిర్వాణ అండ్‌ టీమ్‌ చేసిన ప్రయత్నం టక్‌ జగదీష్‌. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచీ మరో బ్రహ్మోత్సవం, రాడ్ అంటూ ట్రోలింగ్ ఓ రేంజిలో జరుగుతోంది. 

Tuck Jagadish director responds to trolls
Author
Hyderabad, First Published Sep 13, 2021, 7:26 AM IST


నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన  తాజా చిత్రం “టక్ జగదీష్” . ఈ సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. సైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో రితూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నాని అన్నగా జగపతిబాబు.. సోదరిగా ఐశ్వర్య రాజేష్ నటించారు. ఈ సినిమా ఎప్పుడో థియేటర్‌లో విడుదల కావాల్సింది. కానీ, కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కారణంగా ఈ సినిమా విడుదల వాయిదాపడింది. దీంతో చేసేదేమీ లేక ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని చిత్ర యూనట్ నిర్ణయం తీసుకుంది. దీంతో వినాయక చవితి కానుకగా విడుదల అయ్యింది. 

భారీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ సినిమా చూస్తే టక్ జగదీష్ ఒకసారి అయితే చూడొచ్చు అని రివ్యూలు వచ్చాయి. ఈ సినిమా ఒక డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేసారు. కానీ యూత్ కి అంతగా నచ్చలేదు. మరొక బ్రహ్మోత్సవం అంటూ ట్రోల్ చేస్తున్నారు. నాని సినిమా కెరీర్లోనే ఈ సినిమా భారీ డిజాస్టర్ అని తేల్చేస్తున్నారు.అసలు ఈ సినిమా ఏ వర్గానికి నచ్చే దాఖలాలు లేవని కొందరు అంటున్నారు.  ఎలాంటి మలుపులూ లేకుండా సాగిపోయింది టక్‌ జగదీష్‌. నెక్స్ట్ ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ఊహించగలిగేలా ఉంది స్క్రీన్‌ప్లే. నాని డైలాగులు చెప్పిన తీరు చాలా సందర్భాల్లో వి సినిమాను గుర్తుచేశాయి. 

దాంతో థియేటర్లలో సినిమా రిలీజ్ చేస్తే దారుణమైన కలెక్షన్లు చూడాల్సి వస్తుందని ఉద్దేశంతోనే మేకర్స్ ముందు జాగ్రత్త పడ్డారు అని ట్రోల్ చేస్తున్నారు. ఆపదలో ఉంటే ఇంటి మీద లైటు వేయడం…లాంటి సీన్స్ మీద ట్రోల్స్ బాగానే జరుగుతున్నాయి. కొంతమంది సినిమా రాడ్ అని,టక్ లూజ్ అయింది అని విమర్శలు చేస్తున్నారు.ఆ ట్రోల్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇవన్ని డైరక్టర్ కూ చేరినట్లున్నాయి. ఈ విషయమై ఆయన ట్వీట్ చేసారు.

శివ నిర్వాణ మాట్లాడుతూ...సినిమా రిలీజ్ అయ్యాక జనం రకరకాల మాట్లాడుకుంటారు. వాళ్లు తాము ఫీలైన ప్రేమను,ద్వేషాన్ని,పాటిటివిటీని ఇలా ఏదైనా స్ప్రెడ్ చేయచ్చు. నెగిటివ్ రియాక్షన్స్ ని ధైర్యంగా ,నిజాయితీగా స్వీకరించి ముందుకు సాగిపోవాల్సిందే అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios