Asianet News TeluguAsianet News Telugu

స్టార్ డైరెక్టర్ సెక్స్ క్వశ్చన్లు.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

బాలీవుడ్ లో ఎన్నో అధ్బుతమైన ప్రేమకథలను తెరకెక్కించిన దర్శకుడు కరణ్ జోహార్. దర్శకుడిగా అతడి మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాలతో పాటు 'కాఫీ విత్ కరణ్' అనే సెలబ్రిటీ షోని హోస్ట్ చేయడం అతడికి సరదా అనే చెప్పాలి. ఈ షోని తనదైన యాంకరింగ్ స్కిల్స్ తో రక్తి కట్టిస్తున్నాడు.

trolling on karan johar
Author
Hyderabad, First Published Nov 21, 2018, 11:33 AM IST

బాలీవుడ్ లో ఎన్నో అధ్బుతమైన ప్రేమకథలను తెరకెక్కించిన దర్శకుడు కరణ్ జోహార్. దర్శకుడిగా అతడి మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాలతో పాటు 'కాఫీ విత్ కరణ్' అనే సెలబ్రిటీ షోని హోస్ట్ చేయడం అతడికి సరదా అనే చెప్పాలి.

ఈ షోని తనదైన యాంకరింగ్ స్కిల్స్ తో రక్తి కట్టిస్తున్నాడు. ఈ షో మొదటి రెండు సీజన్లు మంచి సక్సెస్ కావడంతో ఆ తరువాత నుండి షోకి మరింత మసాలా యాడ్ చేశాడు కరణ్. ప్రస్తుతం నడుస్తోన్న ఈ షోలో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు, బెడ్ రూమ్ ముచ్చట్లు, సెక్స్ లైఫ్ కి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నాడు కరణ్.

తండ్రీకూతుళ్లు, అన్నాచెల్లెళ్లు ఇలా షోకి ఎవరు వచ్చినా.. వారిని కూడా ఇలాంటి ప్రశ్నలే అడుగుతున్నారు. షోపై ఆసక్తి కలిగించే విధంగా ఇంటర్వ్యూల ప్రోమోలు కూడా ఈ అంశాల చుట్టూ ఉండేలా చూసుకుంటున్నారు.

దీంతో సోషల్ మీడియాలో కరణ్ జోహార్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ దర్శకుడికి పక్క వాళ్ల సెక్స్ విషయాలపై ఇంత ఆసక్తి ఎందుకో..? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ మీ గౌరవాన్ని తగ్గించుకోకండి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios