బిగ్ బాస్ ప్రేక్షకులని బాగా ఆకర్షించిన కంటెస్టెంట్స్ లో పునర్నవి ఒకరు. అగ్రెసివ్ యాటిట్యూడ్ ఉన్నప్పటికీ క్యూట్ లుక్స్ తో చాలా మంది అభిమానులని ఆకర్షించింది. కానీ క్రమంగా పునర్నవిపై వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. ఆరంభంలో ఎక్కువగా నామినేషన్స్ నుంచి బయటపడుతూ వచ్చింది. 

బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున గారు.. నాగార్జున గారు అని పిలిచే పునర్నవి ప్రస్తుతం తన మాటతీరుతోనే విసిగిస్తోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాహుల్ తో పాటు రవిపై దరిద్రుడా, వెధవ, హౌలా ఇలాంటి పదాలు ఉపయోగిస్తుండడంతో పునర్నవిపై తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. 

మరికొందరు నెటిజన్లు అయితే.. ఉయ్యాలాజంపాలా చిత్రంలో పునర్నవికి జండూబామ్ అని దర్శకుడు ఇందుకే పేరు పెట్టాడేమో.. బిగ్ బాస్ హౌస్ లో పునర్నవిలా ఇరిటేషన్ తెప్పించే కంటెస్టెంట్స్ మరొకరు లేరు. 

పునర్నవి విషయంలో బిగ్ బాస్ 3పై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. కావాలనే లవ్ ట్రాక్ కోసం పునర్నవిని సేవ్ చేస్తూ వస్తున్నారనే విమర్శ వినిపిస్తోంది. వాస్తవానికి రమ్యకృష్ణ హోస్ గా వ్యవహరించిన వీక్ లోనే పునర్నవి ఎలిమినేట్ కావలసింది. కానీ ఆ వారం ఎలిమినేషన్ ని ఎత్తేశారు. 

పునర్నవి మనిషి ఎదురుగా లేనప్పుడు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తుంది. అందరు ముందు తాను నిజాయతీ పరురాలిని అని బిల్డప్ ఇస్తుంది. ఈ తరహా కామెంట్స్ పునర్నవిపై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఈ వారం పునర్నవి నామినేట్ అయింది. ఎలాగైనా ఆమెని ఎలిమినేట్ చేసి సాగనంపాలని నెటిజన్లు భావిస్తున్నారు. 

ఈ వారం మహేష్, రాహుల్, పునర్నవి, వరుణ్ సందేశ్ నామినేట్ అయ్యారు. ఈ వారం కనుక పునర్నవి ఎలిమినేట్ కాకుంటే బిగ్ బాస్ ఏదో ఒక గ్యాంబ్లింగ్ చేసి ఆమెని ఫైనల్ వరకు తీసుకెళ్లడం ఖాయం అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.