Asianet News TeluguAsianet News Telugu

విశాల్ కి కాబోయే భార్యని బూతులు తిడుతున్నారు!

ప్రముఖ తమిళ హీరో, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ త్వరలోనే అనీషా అనే తెలుగమ్మాయిని పెళ్లి చేసుబోతున్నాడు. సంక్రాంతి సందర్భంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ఈ జంట. 

Troll says Vishal is marrying Anisha Alla for money
Author
Hyderabad, First Published Jan 18, 2019, 12:37 PM IST

ప్రముఖ తమిళ హీరో, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ త్వరలోనే అనీషా అనే తెలుగమ్మాయిని పెళ్లి చేసుబోతున్నాడు. సంక్రాంతి సందర్భంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ఈ జంట. 

ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడిన తరువాత కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు మాత్రం విశాల్ కి కాబోయే భార్య అనీషాని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆమెని బూతులు కూడా తిడుతున్నారు.

''డబ్బుతో ఎవరైనా ముష్టివాడ్ని కొనుక్కోవచ్చుగా.. విశాల్ ని ఒంటరిగా వదిలేయ్.. నీకు సిగ్గులేదా'' అంటూ అసభ్యకరమైన పదజాలంతో ఓ యువతి పోస్ట్ పెట్టింది. ఇది చూసిన అనీషా హుందాగా ప్రవర్తిస్తూ.. ''డబ్బు చూసే విశాల్ నన్ను పెళ్లి చేసుకుంటున్నాడని నువ్వు భావిస్తున్నావంటే.. నీకు విశాల్ మీద ఎంత గౌరవం ఉందో అర్ధమవుతోంది. కొన్ని సార్లు జీవితంపై కూడా విశ్వాసం ఉంచండి. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. టేక్ కేర్'' అంటూ సమాధానమిచ్చింది.

అనీషా ఇచ్చిన సమాధానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇలాంటి విమర్శలను మీరు పట్టించుకోవద్దు అంటూ అనీషాకి సలహాలు ఇస్తున్నారు. 

ముందు నేనే ప్రపోజ్ చేశా: విశాల్!

విశాల్ కూడా చెప్పేశాడు..!

షాకింగ్: 'అర్జున్ రెడ్డి' నటితో విశాల్ పెళ్లి!

 

Follow Us:
Download App:
  • android
  • ios