ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో వర్క్ చేయించుకోవాలంటే ఎంత రెమ్యునేషన్ ఇచ్చుకోవాలి. అందులోనూ అల వైకుంఠపురమలో...సూపర్ హిట్ తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరిగింది. స్టార్ హీరోలంతా ఆయనతో పనిచేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన ఓ యాడ్ చేయటానికి సిద్దపడ్డారు. అల్లు అర్జున్ తో డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ ‘అహా’ కోసం ఆయన ఈ యాడ్ వీడియో రూపిందించనున్నారు. ఇది రూపొందించటం కోసం ఎంత రెమ్యునేషన్ ని అల్లు అరవింద్ ఆఫర్ చేసారు. త్రివిక్రమ్ ఎంత తీసుకుంటున్నారు...అనేది ఆసక్తికరమైన విషయం.

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు...డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ ‘అహా’  కోసం తాను ఈ యాడ్ ని ఫ్రీగా చేస్తానని చెప్పారట. అల్లు అర్జున్ సొంత సంస్ద కావటంతో..అతనితో ఉన్న అనుబంధంతో త్రివిక్రమ్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారట. కేవలం ఒకే ఒక రోజు లో ఈ యాడ్ షూట్ పూర్తి చేయబోతున్నారట. అయితే అల్లు అరవింద్ ఫ్రీ గా చేయించుకుంటారా అంటే..ఏదో ఒక గిప్ట్ ని చివర్లో త్రివిక్రమ్ కు ఇస్తారు అని చెప్పుకుంటున్నారు.  త్వరలో షూట్ ప్రారంభంకానుందని ఫిలింనగర్ టాక్. 

 ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, మైహోమ్స్ రామేశ్వరరావ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ ‘అహా’ ఓటీటీ(OTT) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే పలు లేటెస్ట్ మూవీస్ స్ట్రీమింగ్ అవుతండగా అనేక వెబ్ సిరీస్ లు ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. నవదీప్, బిందు మాధవి, విజయ్ దేవరకొండ వంటి సెలబ్స్ ‘అహా’కు ప్రమోటర్స్‌గా వ్యవహరిస్తున్నారు.