Asianet News TeluguAsianet News Telugu

త్రివిక్రమ్.. వన్ ఇయిర్ ఛాలెంజ్

చిన్న డైరక్టర్స్ కు ఎలాగూ పనులు లేవు. పెద్ద డైరక్టర్ కూడా ఐడిల్ గా కూర్చోవల్సిన పరిస్దితి ఏర్పడింది. ఎందుకంటే పెద్ద హీరోలతో కమిటై.. వారి డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా దెబ్బతో ఎంత మంది క్రూతో ఎన్ని రోజుల్లో తమ సినిమాలు తీయగలం అనేది ప్లాన్ చేయటం పెద్ద టాస్క్. ఇవన్ని ప్రముఖ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఆలోచనలో పడేసి,ఐడిల్ గా ఉండేలా చేస్తున్నాయి.  

Trivikram Srinivas may wait one year for ntr?
Author
Hyderabad, First Published May 23, 2020, 8:31 AM IST

సినీ పరిశ్రమలో ప్లానింగ్,డేట్ల్ షెడ్యూలింగ్ అనేవి అతి ముఖ్యమైనవి. అయితే ఇప్పుడున్న పరిస్దితుల్లో ఎవరన్నీ ప్రణాళికలు వేసినా కరోనా కత్తులు ముందు ఖతం అయ్యిపోతున్నాయి. అప్పటికీ స్టేట్ గవర్నమెంట్ షూటింగ్ లకు ఫర్మిషన్ ఇచ్చినా తమ సినిమాల రీ షెడ్యూల్ ప్లాన్ లను ఎలా చేయాలో అర్దం కానీ సిట్యువేషన్ నెలకొని ఉంది. ఇంతకు ముందు నిర్మాత దగ్గర సాలిడ్ గా డబ్బు ఉంటే చాలు అన్ని సవ్యంగా జరిగిపోయేవి. అయితే ఇప్పుడు డబ్బుతో పాటు, ప్రోపర్ ప్లానింగ్ అత్యవసరం. ఈ క్రమంలో చిన్న డైరక్టర్స్ కు ఎలాగూ పనులు లేవు. పెద్ద డైరక్టర్ కూడా ఐడిల్ గా కూర్చోవల్సిన పరిస్దితి ఏర్పడింది. ఎందుకంటే పెద్ద హీరోలతో కమిటై..వారి డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా దెబ్బతో ఎంత మంది క్రూతో ఎన్ని రోజుల్లో తమ సినిమాలు తీయగలం అనేది ప్లాన్ చేయటం పెద్ద టాస్క్. ఇవన్ని ప్రముఖ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఆలోచనలో పడేసి, ఐడిల్ గా ఉండేలా చేస్తున్నాయి.  

వాస్తవానికి త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేయటానికి సైన్ చేసారు. మరికొద్ది నెలల్లో షూట్ కు వెళ్లిపోవాలి. కానీ ఎన్టీఆర్ ..ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఎప్పుడు వస్తారో తెలియదు. ఆ తర్వాత మాత్రమే ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా మొదలెట్టగలరు.  ఇప్పుడున్న సినారియో ప్రకారం... ఇది అసాధ్యం. ఖచ్చితంగా ఈ  సంవత్సరం చివర దాకా వెయిట్ చెయ్యాల్సిందే. వచ్చే సంవత్సరం ఈ రోజులు దాకా అన్ని చక్కబడి ఎన్టీఆర్ తో సినిమా మొదలెడతారనే నమ్మకం లేదు. అలాగని ఈ లోగా ఓ చిన్న సినిమా త్రివిక్రమ్ లాగేయటానికి ఎన్టీఆర్ ఒప్పుకుంటా రో లేదో తెలియదు. ఖాళీగా ఉన్న సమయంలో ..స్క్రిప్టు కు పదను పెట్టుకోమని చెప్పచ్చు. దాంతో ఓ సంవత్సరం పాటు త్రివిక్రమ్ కు ఛాలెంజ్ లాంటిదే అంటున్నారు ఇండస్ట్రీ జనం.

ఇదిలా ఉంటే... ఎన్టీఆర్ పుట్టినరోజుకి ఎన్టీఆర్30 టైటిల్ అనౌన్స్ అవుతుందని అభిమానులు ఆశపడ్డారు. ఆర్.ఆర్.ఆర్. కి కూడా ఏమీ స్పెషల్ విడుదల చేయకపోవడంతో హారిక హాసిని వాళ్ళు ‘అరవింద సమేత’ డైలాగ్ ప్రోమో వేసి సరిపెట్టారు. ఈ సినిమా కోసం ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. దాంతో ఫాన్స్ కూడా ఈ టైటిల్ తో పోస్టర్లు తయారు చేస్తూ బిజీగా ఉన్నారు తారక్ తో తీసేది పక్కా ఫామిలీ సినిమా అని వేరే  టైటిల్ పెట్టే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్టు సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios